రాణా గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ తో ‘దమ్ మారో దమ్’ ...!

By Sindhu

టాలీవుడ్ హీరో రానా, అభిషేక్ బచ్చన్, బిపాషా బసు నటించిన 'దమ్ మారో దమ్' చిత్ర విడుదలకు ముంబై హైకోర్ట్ అనుమతి ఇచ్చింది. ఈ చిత్రంలో గోవా సంస్కృతిని, ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని గోవా మీడియాకు చెందిన వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 'గోవాలో మద్యం ధరల కన్నా అమ్మాయిలు తక్కువ ధరకే దొరుకుతారని' చెప్పే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పిటీషనర్ తెలిపారు.

చిత్రంలోని అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను నిర్మాత తొలగించినందున చిత్రం విడుదలకు అనుమతి ఇస్తునట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో 'దమ్ మారో దమ్' చిత్ర విడుదలకు ఆటంకాలు తొలిగిపోయాయి. అయితే తొలగించిన సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయో లేదో తెలుసుకొనుటకు తమకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టును డిమాండ్ చేసారు.

'దమ్ మారో దమ్" సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న దగ్గుబాటి రాణాకి గుడ్ న్యూస్. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రాన్ని కొందరు విమర్శకులకి ప్రదర్శించగా, వారందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లభించింది. సినిమా చాలా బాగుందని నోటెడ్ క్రిటిక్స్ దీనికి టిక్ మార్క్ పెడుతున్నారు.

భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు పాజిటివ్ బజ్ రావడం నిజంగా చాలా హెల్పవుతుంది. ఎందుకుంటే క్రేజ్ కారణంగా ఓపెనింగ్ ఎలాగో బాగుంటుంది. ఇక ఎక్స్ పెక్టేషన్స్ కనుక రీచ్ అయితే సినిమాకి ఆకాశమే హద్దవుతుంది. ట్రెండీ ట్రెయిలర్స్, ఎగ్రెసివ్ ప్రమోషన్..అన్నింటికీ మించి దీపికా పదుకొనే చేసిన 'దమ్ మారో దమ్" సాంగ్ సూపర్ హిట్ అయి ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ తీసుకురావడం దీనికి భారీ ఓపెనింగ్స్ రావడానికి దోహదపడతాయని అంచనాలున్నాయి. ప్రేక్షకులు కూడా విమర్శకులలానే రియాక్ట్ అయితే కనుక రాణా ఆశిస్తున్న ఆ గ్రేట్ లాంఛ్ గ్యారెంటీ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X