'డాన్ శీను' గా రవితేజ
గతంలో దుబాయ్ శీను గా అలరించిన రవితేజ ఈసారి డాన్ శీనుగా అవతరించనున్నారని విశ్వసనీయ సమాచారం.ఇందలో రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడని తెలుస్తోంది. మలినేని అనే నూతన దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవి మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఆర్.ఆర్.మూవి మేకర్స్ వారు రవితేజతో కిక్ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చి్త్రంలో రవితేజ సరసన అనూష్క చేస్తోంది. అనూష్క గతంలో రవితేజతో విక్రమార్కుడు,బలాదూర్ చిత్రాల్లో చేసిన విషయం తెలిసిందే. కోనవెంకట్ కథ-మాటలు అందివ్వనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది. ఇక ఈ చిత్రానికి పనిచేసే మిగతా సాంకేతిక,తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు.
రవితేజ అనుష్క గోపీచంద్ ఆర్.ఆర్.మూవి మేకర్స్ డాన్ శీను కోనవెంకట్ కిక్ ఇలియానా raviteja donsrinu vikramarkudu konavenkat gopichand kick anushka rr movie makers


Click it and Unblock the Notifications