డ్రగ్స్ కేసు: లాయర్‌తో రవితేజ చర్చలు, పక్కా ప్లానింగుతో విచారణకు!

డ్రగ్స్ కేసులో రవితేజ శుక్రవారం విచారణకు హాజరవుతున్నారు. షూటింగులో ఉన్న రవితేజ విచారణ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

By Bojja Kumar

హైదరాబాద్: హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసు విచారణ పర్వంలో....రవితేజ సమయం ఆసన్నమైంది. రేపు (జులై 28) రవితేజ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. కొన్ని రోజులుగా సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాల్లో ఉన్న రవితేజ ఈ కేను నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్నారు.

సిట్ విచారణ ఎదుర్కొనే ముందు రవితేజ ప్రముఖ లాయర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కొనాలి, ఇతర న్యాయ పరమైన అంశాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

మీడియా కంటపడకుండా

మీడియా కంటపడకుండా

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్న సినీ స్టార్లు ఇంటి వద్ద నుండి బయల్దేరిన సమయం నుండే మీడియా వాహనాలు వెంటాడుతూ, ప్రతి కదలికను లైవ్ ప్రసారం చేస్తూ సెన్సేషన్ చేస్తున్న నేపథ్యంలో మీడియా కంట పడకుండా రవితేజ సిట్ విచారణకు హాజరు కావాలనే ఉద్దేశ్యంలో ఉన్నారట.

Recommended Video

Public Reactions on Videos That Blaming Ravi Teja | Filmibeat Telugu
ఇంటి వద్ద నుండి కాకుండా...

ఇంటి వద్ద నుండి కాకుండా...

రేపు ఉదయం తన ఇంటి వద్ద నుండి కాకుండా.... ఎలాంటి హడావుడి లేకుండా వేరే ప్రాంతం నుండి నేరుగా సిట్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఆయన ఎక్కడ నుండి సిట్ విచారణకు హాజరువుతారనే విషయం రహస్యంగా ఉంచారు.

మీడియాకు దూరంగా

మీడియాకు దూరంగా

ఇటీవల మరణించిన తన తమ్ముడు భరత్ పెద్దకర్మకు హాజరైన రవితేజ.... మీడియా ప్రశ్నల తీరుతో ఇబ్బంది పడ్డారు. సిట్ విచారణ తర్వాత మీడియా వారికి మళ్లీ ఛాన్స్ ఇస్తే తమ ప్రశ్నలతో మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సెలబ్రిటీలు కావడంతో సెన్సేషన్

సెలబ్రిటీలు కావడంతో సెన్సేషన్

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, ఛార్మి, సుబ్బరాజు, నవదీప్ తదితరులు ఇప్పటికే హాజరవ్వగా.... గురువారం ముమైత్ ఖాన్ సిట్ విచారణకు వచ్చారు. విచారణకు హాజరవుతున్న వారంతా సినీస్టార్లు కావడంతో మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

రవితేజ కోసం ప్రత్యేక ప్రశ్నావళి

రవితేజ కోసం ప్రత్యేక ప్రశ్నావళి

విచారణకు హాజరవుతున్న సెలబ్రిటీలను సిట్ అధికారులు భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. రవితేజ కోసం ప్రత్యేకంగా ప్రశ్నావళిని తయారు చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X