నేనింతే టైపా? తీరుమారని రవితేజ సోదరుడు, బెయిల్

మద్యం మత్తులో రోడ్డుపై కారు నిలిపి న్యూసెన్స్ చేస్తున్న భరత్‌ను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపై దాడికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే భరత్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ....భరత్ పోలీసులపై దాడి చేయలేదని, పోలీసులే భరత్‌ను అనవసరంగా కేసులో ఇరికించారని తెలిపారు.
రవితేజ సోదరులు నేనింతే టైపా?
రవితేజ సోదరులు భరత్, రఘు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. భరత్ గతంలో కూడా మద్యం మత్తులో ఒకరిని ఢీ కొట్టి పరారయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పవిత్రమైన తిరుమలలో కూడా నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ తాగుతూ మీడియాకు చిక్కారు.
గతంలో ఓ కేసులో కోర్టుకు హాజరైన సందర్భంగా మీడియా పట్ల దుర్భాషలాడారు. ఇంత జరిగినా....రవితేజ సోదరుడు భరత్ 'నేనింతే' అనే విధంగా ఏమాత్రం తీరు మార్చుకోక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. పరిశ్రమలో ఎంతో మంచి పేరున్న రవితేజ సోదరుల తీరుతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


Click it and Unblock the Notifications











