హీరో సచిన్‌ జోషి అరెస్ట్.. ముంబై ఎయిర్‌పోర్టులో హైదరాబాద్‌ పోలీసులు సినీ ఫక్కీలో..

యువ హీరో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. గుట్కా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్న నగర పోలీసులకు తాజాగా భారీగా గుట్కా బాక్సులు భారీగా దొరకడంతో నిందితులను ప్రశ్నించగా పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్ జోషిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ అరెస్ట్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Recommended Video

Hero Sachin Joshi Taken Into Custody By Hyderabad Police At Mumbai Airport
గుట్కా అక్రమ రవాణా చేస్తూ..

గుట్కా అక్రమ రవాణా చేస్తూ..

ఇటీవల అక్రమ గుట్కా రవాణకు పాల్పడుతున్న కొందరిని పోలీసులు పట్టుకొన్నారు. గుట్కా రవాణాపై నిషేధం ఉండటంతో నిందితులను ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులను విచారించగా హీరో సచిన్ పేరును బయటపెట్టారు. దాంతో ఆయనకు నోటీసులు జారీ చేయగా వాటిని పట్టించకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

హైదరాబాద్ పోలీసులకు చిక్కకుండా

హైదరాబాద్ పోలీసులకు చిక్కకుండా

ఇదిలా ఉండగా, సచిన్ జోషి గురించి నిందితుల వెల్లడించిన అంశాలను నిర్ధారించుకొన్న తర్వాత హైదరాబాద్‌కు చెందిన పోలీసు బృందం ముంబైకి వెళ్లింది. ముంబైలో సచిన్ ఆచూకీపై ఆరా తీసింది. ముంబైలోని చత్రపతి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిఘా పెట్టిన పోలీసులు ఆయనను అక్కడే అదుపులోకి తీసుకొన్నారు.

 ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలింపు

ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలింపు

గుట్కా కేసులో అరెస్ట్ చేస్తున్నామంటూ సమన్లు జారీ చేయడం, నోటీసుల ఆధారంగా సచిన్ జోషిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధి మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలుపై కేసు నమోదు చేశారు.

లక్షల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం

లక్షల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం

హైదరాబాద్ పోలీసులు వర్గాలు వెల్లడించిన ప్రకారం.. భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ లక్షల రూపాయల్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే సచిన్ విచారించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్టు సమాచారం.

దేశంలోనే గుట్కా కింగ్‌గా సచిన్ జోషి..

దేశంలోనే గుట్కా కింగ్‌గా సచిన్ జోషి..

దేశంలో గుట్కా వ్యాపారంలో సచిన్ జోషి కుటుంబం ప్రసిద్ధి. గుట్కా కింగ్‌గా సచిన్ జోషి తండ్రిని అభివర్ణిస్తారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుట్కా అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇక సచిన్ విషయానికి వస్తే మౌనమేలనోయి చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆషికి 2 రీమేక్ చేసి ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X