తెలుగులో ఫెయిలై..బాలీవుడ్ ల్యాండైన పొట్టి హీరో
ఆ మధ్య తెలుగు తెరపై ఇలా కనిపించి అలా మాయమైన హీరో సచిన్ గుర్తున్నాడా? అదేనండీ మౌనమేలనోయి, ఒరేయ్ పండు, నిన్ను చూడక నేనుండలేను సినిమాల్లో హీరోగా చేశాడే..అతడే. చాలా కాలంగా తెరమరుగైన ఈ హీరో ఇప్పడు బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.
టాలీవుడ్ లోనే ఈ హీరోను ఎవరూ పట్టించుకోలేదు..మరి బాలీవుడ్ లో ఎవరు పట్టించుకుంటారు? అసలు ఇతగాన్ని హీరోగా పెట్టి బాలీవుడ్ లో సినిమా తీసే ధైర్యం చేసిన నిర్మాత ఎవరబ్బా.... అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. సచిన్ కు డబ్బుకు కొదవలేదు.
ఎందుకంటే ఈ హీరో వేలకోట్లకు వారసుడు, సచిన్ తండ్రి దేశంలోనే టాప్ గుట్కా వ్యాపారి. పాపం సచిన్ కు అన్నీ ఉన్నాయి కానీ...సరైన హైట్ లేదు. యాక్టింగ్ లో కూడా వీక్ అనే చెప్పాలి. కానీ డబ్బు ఉంది కాబట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తతం 'ఆజాన్" అనే సినిమా ద్వారా బాలీవుడ్ పై కన్నేశాడు. చూద్దా ఈ పొట్టి హీరో బాలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ అవుతాడో..?


Click it and Unblock the Notifications











