BRO.. పవన్ సూపర్ త్రోబ్యాక్ ఫొటోతో సాయితేజ్ ఎమోషనల్ పోస్ట్.. చదివితే మీరు కూడా..

'మరో రీమేక్‌లో పవన్‌ కల్యాణ్‌?', 'మెగా హీరోల మల్టీస్టారర్‌?', 'పవన్‌ - సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్నారా?'.. కొన్ని నెలల క్రితం ఈ వార్తలు టాలీవుడ్ అభిమానుల్లో ఓ ఊపు ఊపేశాయి. ఆ తర్వాత దర్శకుడు సముద్రఖని.. ఆ వార్తలకు తగ్గట్టే సినిమాను అనౌన్స్ చేసి పవన్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు. తాజాగా ఆ చిత్రం 'బ్రో' (జులై 28) విడుదలై బాగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సాయి తేజ్.. పవన్ తో పాటు అభిమానులను ఉద్దేశిస్తూ స్పెషల్ నోట్ రాసుకొచ్చారు. ఓ త్రో బ్యాక్ ఫొటోనూ షేర్ చేశారు. వివరాళ్లోకి వెళితే..

హార్ట్ ఫుల్ లాంగ్ నోట్... :

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ - సాయిధరమ్‌ తేజ్ తో పాటు మెగా అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'బ్రో'. ఈ క్రేజీ కాంబో ఎట్టకేలకు జులై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రంలో నటించిన సాయితేజ్ కు తన మావయ్య పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో పవన్ పై తనకున్న ప్రేమను, అభిమానాన్ని చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాజాగా 'బ్రో' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మరోసారి తన ప్రేమను తెలియజేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ రాశారు.

Hero Sai Dharam Tej shared a Emotional Note about Power Star Pawan Kalyan news goes viral

అసలీ రోజును ఏమని పిలవాలి.?. :తాను పసివయసులో ఉన్నప్పుడు పవన్ తనతో కలిసి దిగిన త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేశారు సాయితేజ్. "అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. అసలీ రోజును ఏమని పిలవగలను?, నా కల నెరవేరిన రోజు, మర్చిపోలేని రోజు, జీవితకాలం గుర్తుండిపోయే ఓ మధరు జ్ఞాపకం. ప్రస్తుతం నా మనసులోని మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా గురు, నా మామ, నా మావయ్య.. నాకు అన్నీ పవన్ కల్యాణ మావయ్యే. ఆయన్ను చూస్తూ, సూర్తిగా తీసుకుని.. ఆయన మార్గదర్శకత్వంలో నడిచాను. ఇప్పటికీ ఆయన చేతిని పట్టుకుని నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను" అని సాయి తేజ్ చెప్పుకొచ్చారు.

నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ... :"థ్యాంక్యూ త్రివిక్రమ్ గారూ. నన్నునమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు. నా కలను నెరవేర్చుకోవడంతో నేను నిజంగా కృతజ్ఞుతవంతుడిని, ధన్యుడిని అయ్యాను. అలానే దర్శకుడు సముద్రఖని సార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల గారికి, మూవీటీమ్ ప్రతిఒక్కరికీ.. నన్ను నమ్మి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను" అని సాయి తేజ్ చెప్పారు.

అవే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి..... :"నా ముగ్గురు మామలు, వారి అభిమానులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అలాగే మిగతా హీరోల అభిమానులు, సినిమా లవర్స్.. ఇలా మీ అందరి ప్రేమాభినాలు, మద్దతు నన్ను ఇలా ముందుకు నడిపిస్తున్నాయి. నాకన్నా ఈ బ్రో సినిమా మీకే ఎక్కువ సొంతం. చిత్రీకరించేటప్పుడు మేము హ్యాపీగా ఫీలై బాగా ఆస్వాదిస్తూ ఎలా చేశామో.. అంతకన్నా ఎక్కువగా మీరు సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా జర్నీలో, నా కల నిజమవ్వడంలో భాగమైన ప్రతిఒక్కరికీ మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి బ్రో మీదే బాగా ఎంజాయ్ చేయండి" అని సాయి తేజ్ పేర్కొన్నారు.

Hero Sai Dharam Tej shared a Emotional Note about Power Star Pawan Kalyan news goes viral

సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా.. :ఇకపోతే 'బ్రో' సినిమాలో పవన్ కల్యాణ్ టైమ్ అనే మోడ్రన్ గాడ్ పాత్రలో కనువిందు చేశారు. సాయితేజ్ మార్క్ అనే పాత్రలో నటించారు. ఈ మామాఅల్లుళ్లతో పాటు హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. బ్రహ్మనందం సహా పలువురు నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాను నిర్మించారు. తమిళంలో బ్లాక్ బాస్టర్ అందుకున్న 'వినోదయ సీతమ్' కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X