ఏపీలో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం.. పవన్ కోసం ఎక్కడ? ఎప్పుడు క్యాంపెయిన్ అంటే?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఏపీలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి దృష్టి ఆకర్షిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. గోదావరి జిల్లాలో అధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో పవర్ స్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆయన ప్రచార, పర్యటన వివరాల్లోకి వెళితే..

పిఠాపురం నియోజకవర్గానికి సినీ తారలు పోటెత్తారు. పవన్ కల్యాణ్‌ను అభిమానించే తారలు, టెలివిజన్ యాక్టర్లు స్వచ్చందంగా ప్రచారం చేస్తూ ఆయన గెలుపు కోసం కాకుండా రికార్డు మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. జబర్దస్త్ టీమ్, గబ్బర్ సింగ్ టీమ్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

Hero Sai Dharam Tej to campaign in Machilipatnam Pithapuram Kakinada for Pawan Kalyan and Janasena

ఇక ఇటీవల పిఠాపురంలో మెగా హీరో వరుణ్ తేజ్ పర్యటనకు భారీ స్పందన లభించింది. ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించగా.. విశేషంగా జనం ఆయన ప్రచార సభలకు హాజరయ్యారు. ఇక ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించారు. ఆయన తన మేనమామను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఒక ప్రచార గడువుకు సమయం దగ్గర పడుతుండటంతో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. మే 4వ తేదీన మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. ఆయన ఇప్పటికే రోడ్ షోలు పాల్గొన్నారు. మచిలీపట్నంలో భారీ ప్రజాదరణ కనిపించింది.

Hero Sai Dharam Tej to campaign in Machilipatnam Pithapuram Kakinada for Pawan Kalyan and Janasena

ఇక మే 5వ తేదీన సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆదివారం ఆయన ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలు, సభల్లో పర్యటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గడపగడపకు ప్రచారం చేయాలని నిర్ణయించుకొన్నారు. తన మేనమామకు రికార్డు విజయం చేకూర్చాలని ఓటర్లను కోరుతున్నారు.

ఇక మే 6వ తేదీన సాయిధరమ్ తేజ్ కాకినాడలో పర్యటిస్తారు. ఆయన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి టీ టైమ్ ఉదయ్ కోసం ప్రచారం నిర్వహిస్తారు. కాకినాడలో కూడా రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొంటారు. అలాగే తన అభిమానులు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X