హీరో సప్తగిరిపై వస్తున్న వార్తలు అవాస్తవం.. డైరెక్షన్ చేయడం లేదు!

Recommended Video

He Is Not Interested In Direction At This Point : Saptagiri's PR Team

కమెడియన్‌గా తనదైన హాస్యంతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన సప్తగిరి హీరోగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలు ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో విభిన్నమైన కథాంశాలతో మరికొన్ని చిత్రాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సప్తగిరి దర్శకుడిగా మారబోతున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై తెలుగు ఫిల్మీబీట్‌కు సప్తగిరి పీఆర్ టీం వివరణ ఇచ్చింది.

సప్తగిరి ఎల్ఎల్‌బీ తర్వాత గ్యాప్ తీసుకొన్న సప్తగిరి మరో మూడు సినిమాలతో బిజీగా మారనున్నారు. ఆయనకు దర్శకుడిగా మారే ఆలోచన లేదు. దర్శకుడిగా మారబోతున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నిరాధారమైన వార్తలను నమ్మకూడదు అని సప్తగిరి పీఆర్ టీం వెల్లడించింది.

Hero Saptagiri is not doing Direction

సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ మంచి కథ కోసం ఆగాల్సి వచ్చింది. త్వరలోనే సప్తగిరి హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నది. మరో రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి అని వారు పేర్కొన్నారు.

గతంలో పరుగు అనే సినిమాకు సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సినిమా పరిశ్రమలోని పలు విభాగాలపై ఆయనకు పట్టు ఉందని విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X