బ్లఫ్ మాస్టర్‌గా సత్యదేవ్.. నందితాశ్వేతతో కలిసి..

By Rajababu

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన చ‌తురంగ వేట్టై చిత్రానికి త‌మిళ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది . అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత .గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి దర్శకుడు . జ్యోతిల‌క్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు . ఎక్క‌డికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక‌.

నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . త‌మిళంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన చిత్రం చ‌తురంగ వేట్టై, తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కొడైకెనాల్‌,కర్నూలు ,వైజాగ్‌, హైద‌రాబాద్‌లో చిత్రీకరణ జరిపాం . ఎక్క‌డా రాజీప‌డ‌కుండా హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున , చిత్రాన్ని ఆగస్ట్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది అని అన్నారు.

Hero Satya Dev as Bluff Master

దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ రోజూ ఏ దినపత్రిక చదివినా , ఏ టీవీ ఛానల్ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి . మనిషికి ఆశ సహజం . కానీ అది అత్యాశగా మారినప్పుడే ఘోరాలు , నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు .ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది అని చెప్పారు.

Hero Satya Dev as Bluff Master

ఆదిత్యామీన‌న్‌, పృథ్వి, బ్ర‌హ్మాజీ, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, శ్రీరామరెడ్డి , వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, దిల్‌ ర‌మేష్‌ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి క‌థ‌: హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయ‌ణ‌, సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా: దాశరథి శివేంద్ర‌ , కో డైర‌క్ట‌ర్‌: కృష్ణ‌కిశోర్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్: ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌,నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, మాటలు -ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X