ఆ నిర్మాతలకు యువహీరో శర్వానంద్ సూచన!

హీరోగా సక్సెస్ ఫుల్ జర్నీని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. కాని శర్వానంద్ వరుస సక్సెస్ సినిమాలతో దుసుకెల్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఈ హీరో మరిన్ని సినిమాల్లో నటించబోతున్నాడు. కథ, కథనం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నాడు.

Recommended Video

Sai Pallavi Next Movie Padi Padi Leche Manasu Poster Release
 సాయి పల్లవి హీరోయిన్ గా

సాయి పల్లవి హీరోయిన్ గా

శర్వానంద్ హీరోగా , సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న చిత్రం "పడి పడి లేచే మనసు". 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' వంటి సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సునీల్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నాడు. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

రెండు విభిన్న పాత్రల్లో

రెండు విభిన్న పాత్రల్లో

శర్వానంద్ హను రాఘవపూడి సినిమాతో పాటు స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శర్వానంద్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.

సుదీర్ వర్మ సినిమాలో కాజల్

సుదీర్ వర్మ సినిమాలో కాజల్

ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాక శర్వానంద్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సుదీర్ వర్మ సినిమాలో కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇద్దరికి సమానమైన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

వేణు ఊడుగుల , శ్రీకాంత్ అడ్డాల

వేణు ఊడుగుల , శ్రీకాంత్ అడ్డాల

శర్వానంద్ ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అందులో మొదటిది దర్శకుడు వేణు ఊడుగుల సినిమా మరొకటి శ్రీకాంత్ అడ్డాల సినిమా. త్వరలో ఈ సినిమాలకు సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కథ పూర్తి స్థాయిలో బాగుంటేనే శర్వానంద్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాడని సమాచారం. హను రాఘవపూడి సుదీర్ వర్మ సినిమాలు తప్పా ఏ సినిమాను ఒప్పుకోలేదని సమాచారం. తన మార్కెట్ ను బట్టి సినిమాకు బడ్జెట్ పెట్టమని, ఎక్కువగా ఖర్చు పెట్టొద్దని నిర్మాతలకు శర్వానంద్ చెబుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X