నచ్చిన అమ్మాయి కనబడకే...శర్వానంద్
ఇంతవరకు నాకు నచ్చిన అమ్మాయి కనబడలేదు. అయితే షూటింగ్ లేకుంటే ఫ్రెండ్స్‌తో సరదాగా కాలక్షేపం చేస్తుంటాను అంటున్నారు శర్వానంద్ తన పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ...అలాగే ఆయన పెళ్ళి మ్యాటర్ గురించి చెబుతూ..ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు. అదంతా పెద్దలు చూసుకుంటారు అన్నారు. ఇక తను నటించిన చిత్రాలు 'అందరి బంధువయ', 'ప్రస్థానం' చిత్రాలు వెనువెంటనే విడుదల కానుండటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే రెండు చిత్రాలు ఒకే మాసంలో విడుదల కానుండటం కేవలం కాకతాళీయమేనని శర్వానంద్ అంటున్నారు.
అలాగే 'గమ్యం' చిత్రం తర్వాత తన సినీ ప్రస్థానం గురించి శర్వానంద్ మాట్లాడుతూ "గమ్యం చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చాయనే చెప్పాలి. కానీ నేను కథకు ప్రాధాన్యతను ఇస్తాను. ప్రేక్షకులను రంజింపజేయటం ద్వారా హిట్ సినిమాలో నటించటమే నాకు ముఖ్యం. సరియైన కథ దొరక్కపోతే ఖాళీగా అయినా ఉంటాను. మల్టీస్టారర్ చిత్రాల్లో నటించటానికి నాకు ఎలాంటి పట్టింపు లేదు" అని స్పష్టం చేశారు. ఇక రీసెంట్ గా విడుదలయిన శర్వానంద్ రెండు చిత్రాలు ప్రస్దానం, అందరి బంధువయా మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











