వరదల తాకిడికి కొట్టుకుపోయిన శర్వానంద్ తాత ఇల్లు.. ఏడాది వ్యవధిలోనే ఆ రెండు..

మనిషి జీవితంలో చివరికి మిగిలేవి కొన్ని మంచి జ్ఞాపకాలు మాత్రమే. అందుకే చాలా మంది గతాన్ని గుర్తు చేసే విలువైన వాటిని అంత ఈజీగా వదులుకోరు. ఆ విధంగా మనసుకు ఎంతో హాయిని ఇచ్చే వాటిలో నివాసాలు చాలా ముఖ్యమైనవి. ఇల్లు పాత బడినా కూడా అందులో ఉండే జ్ఞాపకాలు నిత్యం కొత్త అనుభూతిని అందిస్తాయి. అసలు విషయంలోకి వస్తే శర్వానంద్ ఇటీవల ఎంతో ఇష్టంగా చూసుకునే ఇల్లు ఒకటి అనూహ్య పరిణామాలతో కోల్పోవాల్సి వచ్చింది.

ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే శర్వానంద్

ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే శర్వానంద్

టాలీవుడ్ లో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ బయట కనిపించేది చాలా తక్కువ. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే శర్వానంద్ సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తాడు. ట్విట్టర్ ఎకౌంట్ కూడా నిన్న మొన్న అభిమానులకు ఇలాగైనా దగ్గరుండాలని క్రియేట్ చేసుకున్నాడు గాని అంతకుముందు చిన్న ఫోన్ మాత్రమే వాడేవారు.

కృష్ణానది వరదల్లో ..

కృష్ణానది వరదల్లో ..

ఇక చాలా రోజుల తరువాత శర్వానంద్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక విషయంతో వార్తల్లో నిలిచాడు. ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా శర్వానంద్ అద్భుతమైన జ్ఞాపకాలను కోల్పోతున్నాడు. రీసెంట్ గా కృష్ణానది వరద ప్రమాదానికి కొన్ని ఇల్లులు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే అందులో శర్వానంద్ తాత గారి ఇల్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యిందట.

సగానికి పైగా వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు

సగానికి పైగా వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు

శర్వానంద్ తాత భారత మాజీ అనుశాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్. ఇక గత ఏడాది వీరికి చెందిన ఒక పెంకుటిల్లు కూడా కృష్ణ నదిలో పూర్తిగా కొట్టుకుపోయింది. అది శర్వా ముత్తత కట్టించిన ఇల్లు. ఇక లేటెస్ట్ అదే స్థాయిలో వరదలు రావడంతో తాకిడికి సమీపాన ఉన్న ఇల్లు సగానికి పైగా కొట్టుకుపోయింది. వరదల్లో డ్యామేజ్ అయిన ఈ రెండు ఇళ్ళతో శర్వానంద్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

Recommended Video

Happy Birthday Sai Pallavi : Sai Pallavi Film Career Interesting Facts
ఒక ఏడాది లోనే.. ఆ రెండు జ్ఞాపకాలు..

ఒక ఏడాది లోనే.. ఆ రెండు జ్ఞాపకాలు..

ఖాళీ సమయాల్లో అవనిగడ్డకు వచ్చే శర్వా అక్కడే కొన్ని రోజుల పాటు నేచురల్ లైఫ్ ని ఎంజాయ్ చేసి వెళుతుంటాడట. ఏదేమైనా ఒక ఏడాది గ్యాప్ లోనే శర్వా రెండు జ్ఞాపకాలకు రూపం లేకుండా పోయాయి. ఇక ఈ యువ హీరో ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు గత వారం నుంచి రూమర్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X