రోడ్డెక్కిన హీరో సిద్దార్ద...
హీరో సిద్ధార్థ రోడ్డెక్కారు. రోడ్కెక్కడం అంటే అంటే కొంపతీసి ఇంకేదో అనుకోకండి. సినిమా షూటింగులో భాగంగానే ఇదంతా. సిద్దార్ద,శృతిహాసన్ జోడీగా దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం షూటింగ్ ముంబయి-పూనే హైవేపై షూటింగ్ జరుపుకుంటోంది. సిద్ధూ-శృతి మధ్య ఓ పాటను యూనిట్ సభ్యులు చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తి కానుంది. దాంతో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్లే. అనంతరం నిర్మాణ అనంతర కార్యక్రమాలను జరుపుకోనుంది.
ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను వనంబర్ 11న తేదీనాడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూంది. ఈ తేదీ రోజున విడుదల చేస్తే సినిమాకు కలిసొస్తుందని, అన్నీ ఒకట్లతో కూడిన ఇలాంటి తేదీ వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కనుక సినిమా వంద రోజులు ఆడుతుందని వారి నమ్మకమట.
నవదీప్, హన్సికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ- దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











