చచ్చినా ఆ సినిమాలు నేను చెయ్యనంటే చెయ్యను: నాని
"గృహం" సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హారో నాని వచ్చాడు. "నాని ఎప్పుడు హారర్ ఫిలింలో చేస్తాడు? చేస్తే ఎందుకు చేస్తాడు? చెయ్యకపోతే ఎందుకు చెయ్యడు?" అని సిద్దార్థ్ అడిగితే ఈ నాచురల్ స్టార్ చెప్ప
Recommended Video

టాలీవుడ్ లో ఇప్పటికిప్పుడు ఒక చిన్న నిర్మాతల పాలిటి పెద్ద హీరో పేరు చెప్పమంటే వచ్చే మొదటి పేరు "నాని" అయితే నాని మాత్రం ఒక జానర్ సినిమా మాత్రం చేయ్యనని చెప్పేసాడు. నానికి అత్యంత నచ్చిన జానర్లలో 'హార్రర్' ఒకటట. కానీ ఆ జానర్లో నటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

గృహం ఆడియో ఫంక్షన్
సిద్దార్థ్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన "గృహం" సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హారో నాని వచ్చాడు. అంతే కాకుండా హీరో సిద్దార్ధ్‌ని ఇంటర్వ్యూ కూడా చేసాడు. ఇంటర్వ్యూలో భాగంగా గృహం సినిమా విశేషాలను నాని అడిగితే తిరిగి ఇంకొన్ని ప్రశ్నలు సిద్దర్థ్ వేశాడు.

చెయ్యకపోతే ఎందుకు చెయ్యడు?
"నాని ఎప్పుడు హారర్ ఫిలింలో చేస్తాడు? చేస్తే ఎందుకు చేస్తాడు? చెయ్యకపోతే ఎందుకు చెయ్యడు?" అని సిద్దార్థ్ అడిగితే ఈ నాచురల్ స్టార్ చెప్పిన సంగతి ఇదీ... "నాకు హార్రర్ సినిమాలు చాలా ఇష్టం. ఈ జానర్లో బోలెడన్ని సినిమాలు చూశా. ఐతే నాకు హార్రర్ సినిమాల్లో అత్యంత నచ్చేవి సస్పెన్స్.. థ్రిల్ ఉంటుంది.

సినిమా చూడటం ఇష్టం
తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో సినిమా చూడటం నాకెంతో ఇష్టం. థియేటర్లో ఆ భయాన్ని ఆస్వాదిస్తూ సినిమా చూస్తా. కానీ మనం హార్రర్ సినిమా చేస్తే ఆ థ్రిల్ అంతా పోతుంది. కథేంటో ముందే తెలిసిపోతుంది. భయం అనే భావనే ఉండదు. సెట్లో భయపడం. నటీనటుల్ని చూస్తే భయపడం. ఏ ఫీలింగూ ఉండదు.

హార్రర్ సినిమా చేయను
కాబట్టే నేను హార్రర్ సినిమా చేయను. వేరే వాళ్లు చేసిన హార్రర్ సినిమాలతో థ్రిల్లవడమే నాకిష్టం. అదే లవ్ స్టోరీలకు కానీ.. ఇంకో జానర్ సినిమాలకు కూడా థ్రిల్ తో పని ఉండదు. ముందే కథ తెలిసినా ఇబ్బంది లేదు. మామూలుగా సినిమా చేసుకెళ్లిపోతాం'' అని నాని అన్నాడు.


Click it and Unblock the Notifications











