దర్శకుడిగా కనిపించబోతున్న హీరో శివాజీ

By Bojja Kumar

హీరో శివాజీ, సదా జంటగా ఆర్ ఆర్ సినీ పిక్చర్స్ పతాకంపై బాబ్జీ, రత్నమయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్తి శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు సత్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...హీరో శివాజీ ఈ చిత్రంలో దర్శకుడుగా కనిపించబోతున్నాడు. దెయ్యాలు, భూతాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మన మనసులో ఉండే భయమే ఆ దెయ్యాలు. మనలోని మంచితనమే దేవుడు అనే ఈ అంశాన్ని ఇతి వృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము, మే నెలాఖరుకల్లా ఈ చిత్రాన్ని పాటలతో సహా పూర్తి చేస్తామని తెలిపారు.

శివాజీ, సదా, విజయచందర్, కృష్ణ భగవాన్, కొండవలస, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, రాధాకృష్ణ, తాగుబోతు రమేష్, ధనరాజ్, ప్రసాద్, జయవాణి, బేబి సంచలన నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : రవిరెడ్డి, రామకృష్ణ, ఛాయాగ్రహణం : వి.ఎన్.సురేష్ కుమార్, ఎడిటింగ్ : ఉపేంద్ర, ఆర్ట్ : గోపి, ఫైట్స్ : రమణ, కో డైరెక్టర్ : గాంధీ, ప్రొడక్షన్ : బాలాజీ శ్రీను, సి.హెచ్.వాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. భువనేశ్వరి, నిర్మాతలు : సిహెచ్‌విఎస్‌ఎన్ బాబ్జీ, ఎస్ రత్నమయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సత్తి శ్రీనివాసరెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X