బన్నీ, రాంచరణ్, మహేష్‌కు తెలియదు.. పవన్‌కు ఇప్పుడే తెలుస్తున్నాయి.. హీరో శివాజీ !

సినిమాలని పక్కన పెట్టిన హీరో శివాజీ.. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో బిజీగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శివాజీ ప్రత్యక హోదా పోరాటంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యక హోదా అంశం తెరపైకి వచ్చిన ప్రతి సారి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జల్లి కట్టు, కావేరి జలాలు వంటి సమస్యల విషయంలో తమిళ చిత్రపరిశ్రమ మొత్తం ఏకమై పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందుకు కలగడం లేదనే ప్రశ్న మీడియాలో, రాజకీయ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో కూడా తలెత్తుతోంది. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి శివాజీ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నాయకత్వం వహించేది ఎవరు

నాయకత్వం వహించేది ఎవరు

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేక హోదా విషయంలో ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వం లేకపోవడమే అని శివాజీ అన్నారు. చిత్ర పరిశ్రమని లీడ్ చేసే సరైన వ్యక్తి ఉంటే అందరూ ముందుకు వస్తారని శివాజీ అన్నారు.

 షేక్ అవడం ఖాయం

షేక్ అవడం ఖాయం

చిత్ర పరిశ్రమలోని నటులంతా ప్రత్యేక హోదా పోరాటం కోసం ముందుకు వస్తే సెంటర్ షేక్ అయిపోవడం ఖాయం అని శివాజీ అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ వలన రాజ్యాంగమే మారిపోయిందని శివాజీ గుర్తు చేశారు.

వారికి ఇక్కడ బాధ తెలియదు

వారికి ఇక్కడ బాధ తెలియదు

అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్ వంటి హీరోలంతా చెన్నె బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారని అందుకే వారికి ఏపీలో సమస్యలు తెలియవని శివాజీ అన్నారు. తెలిస్తే సైలెంట్ గా ఉండేవారు కాదని అన్నారు. మనమంతా చదువులు పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్లాం. కాబట్టి మనకు ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు అని అన్నారు.

పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడే

పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడే

పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లారు కనుక ఆయనకు ఇప్పుడే ఏపీ సమస్యలు తెలుస్తున్నాయని శివాజీ అన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు అర్బన్ నేపథ్యంలో వచ్చారని శివాజీ అన్నారు.

పోసాని అందుకే విమర్శించారు

పోసాని అందుకే విమర్శించారు

అశ్విని దత్, రాఘవేంద్ర రావు వంటి ప్రముఖులు ఇటీవల చంద్రబాబుని కలసి ప్రత్యేక హోదా విషయంలో ఇండస్ట్రీ తరుపున మద్దత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ తరుపున వెళ్ళడానికి మీరెవరు అని విమర్శించిన పోసాని వ్యాఖ్యలపై శివాజీ స్పందించారు. వారంతా ఇండస్ట్రీ తరుపున అధికారికంగా వచ్చి ఉంటే పోసాని మిమర్శించడానికి అవకాశం ఉండే కాదని శివాజీ అన్నారు.

టాలీవుడ్ టార్గెట్

టాలీవుడ్ టార్గెట్

ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ లో సెగలు రేగుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమం ముదిరితే మరో మారు అందరికి టాలీవుడ్ అందరికి టార్గెట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X