మీడియా లో కనపడాలనే పిచ్చితో...
ఏదో మీడియాలో కనిపించాలన్న తాపత్రయమే కొత్తగా వచ్చిన నిర్మాతలలో ఎక్కువగా కనిపిస్తోంది. వారు సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. సరైన ప్రణాళికలు ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్లు మానసికంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశం కాదు. నా విధి అంతే అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు హీరో శివాజి. తన సినిమాలు వరసగా ఫ్లాఫ్ అవటాన్ని విశ్లేషిస్తూ ఆయన ఇలా చెప్పుకొచ్చారు. కొత్త నిర్మాతల్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడున్న ఉత్సాహం గుమ్మడికాయ కొట్టడంలో కనిపించడం లేదు. అది దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య సినిమాలు కూడా పెద్దగా ఒప్పుకోవట్లేదు.
కథ నచ్చి, సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తారన్న నమ్మకం కుదిరితే తప్పకుండా సినిమాలను అంగీకరిస్తాను. పెద్ద హీరోల చిత్రాల్లో ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమేనని శివాజి మీడియాకు చెప్పుకొచ్చారు. తన చిత్రాల ఫ్లాప్ ఫలితాల ప్రస్తావన వచ్చినప్పుడు-డైరీ, ఇందుమతి, పెళ్లి కాని ప్రసాద్, మా ఆయన చంటిపిల్లాడు..ఇవన్నీ ప్రచార లోపం వల్ల డీలా పడ్డ సినిమాలే. నిజానికి ఆర్థిక మాంద్యం సినిమా పరిశ్రమను తాకలేదు. ఒకవేళ ఆ మాంద్యమే ఉండి ఉంటే వారానికి మూడు సినిమాలు విడుదల కావు అన్నారు. ప్రస్తుతం శివాజీ తానే నిర్మాతగా మారి తాజ్ మహల్ అనే కన్నడ రీమేక్ చిత్రాన్నిప్రొడ్యూస్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











