కుటుంబాల మధ్యలోకా .. నా క్యారెక్టర్‌తో వద్దు, ఆ హీరో వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌ని ఉద్దేశించేనా ..?

చెప్పను బ్రదర్ వివాదంతో పాటు ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేసిన అల్లు అర్జున్ తీరును నిరసిస్తూ మెగా అభిమానులు మండిపోయి ఉన్నారు. దానికి కాస్తా రావు రమేశ్ హీరోగా తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇంద్ర రీరిలీజ్ కావడంతో అందులోని మేనల్లుడి ఎపిసోడ్‌తో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై ఆ సినిమాలో నటించిన సీనియర్ హీరో శివాజీ స్పందించారు.

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జెమిని టీవీలో ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించిన శివాజీ వాక్చాతుర్యం, పర్సనాలిటీ కారణంగా యాంకర్‌గానూ ఛాన్స్ దక్కింది. కొందరి సలహాతో నెమ్మదిగా సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించిన శివాజీ .. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు, ఇతర సహాయక పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదిగాడు. అమ్మాయి బాగుంది, వైఫ్, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, ఒట్టేసి చెబుతున్నా, శ్రీరామచంద్రులు, టాటా బిర్లా మధ్యలో లైలా, శివరామరాజు వంటి సినిమాలు శివాజీకి జనంలో మంచి పేరు తీసుకొచ్చాయి.

Hero Sivaji has countered the mega fans who are using his character in Mega Star Chiranjeevi s Indra movie to troll Allu Arjun

కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ అనూహ్యంగా రాజకీయాల్లో వేలుపెట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనల్లోనూ పాల్గొన్నాడు. అమరావతి, పోలవరం తదితర అంశాలపై తన వాయిస్ బలంగా వినిపించాడు కూడా. దీంతో ఓ పార్టీ తరపున శివాజీ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ దీనిని ఆయన ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

యంగ్ కంటెస్టెంట్స్‌ ముందు శివాజీ నిలబడలేడని ఒక్క వారం కూడా హౌస్‌లో ఉండలేడన్న కామెంట్స్ వినిపించాయి. కానీ హౌస్‌లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే బిగ్‌బాస్ చదివేసిన శివాజీ.. మైండ్‌గేమ్ ఆడాడు. సెలబ్రెటీ కంటెస్టెంట్స్ వైపు కాకుండా సామాన్యులైన ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌లకు అండగా నిలబడి అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌తో వరుస అవకాశాలు శివాజీ ఇంటి ముందు క్యూకట్టాయి. సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్‌లో ఉండే శివాజీ.. సోషల్ ఇష్యూస్‌పై స్పందిస్తుంటారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ అయ్యింది. ఇందులో శివాజీ .. ఆర్తి అగర్వాల్‌కు మేనల్లుడిగా నటించి ఆమె పగలో భాగం పంచుకుంటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ తీరుతో రగిలిపోతున్న మెగా ఫ్యాన్స్ .. ఈ క్యారెక్టర్‌ను బన్నీకి ముడిపెడుతూ ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు దిగారు. తను చేసిన పాత్రతో మరో స్టార్ హీరోను టార్గెట్ చేయడంపై శివాజీ స్పందించారు.

అన్నయ్య చిరంజీవితో చేయడం జీవితంలో మెమొరబుల్ అన్నారు. ఇంటర్వెల్‌కు ముందు తాను ఎవరో నిజం తెలిసే సీన్‌‌ని అందరి సహకారంతో బాగా చేశానని, బీ.గోపాల్ తన చేతిని గట్టిగా పట్టుకుని కాంప్లిమెంట్ ఇచ్చారని శివాజీ గుర్తుచేసుకున్నారు. ఇందులోని తన పెళ్లి సీన్‌ను వేరే హీరోకి ఆపాదించి కుటుంబాల మధ్యలోకి వెళ్లడం కరెక్ట్ కాదని శివాజీ సూచించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి శివాజీ కామెంట్స్‌పై మెగా, అల్లు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: sivaji chiranjeevi allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X