శివాజీ.. టేకిట్ ఈజీ..
అతడు మొదట్లో టీవీ యాంకర్. తర్వాత క్యారెక్టర్ నటుడయ్యాడు. తర్వాత విలన్ వేషాలు వేశాడు. ఆపై మల్టీస్టారర్లు చేశాడు. క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి హీరోగా కూడా అందరి మన్ననలు పొందాడు. రాజేంద్రప్రసాద్ తర్వాత అటువంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కామెడీ చిత్రాలు చేయాలంటే.. నిర్మాతలకయినా, దర్శకులకయినా.. శివాజీయే మొదటి ఛాయిస్. అటువంటి శివాజి ఈమధ్య ఇమేజీ కోసం పోయి దాదాపు డామేజీ కొనితెచ్చుకున్నాడు. సీతారాముడు వంటి మాస్‌మసాలా చిత్రంలో యాంగ్రీయంగ్‌మేన్‌గా, మాస్ హీరోగా రాణిద్దామనుకున్న శివాజీ ఆశలు ఆ సినిమా ఢమాల్ అనడంతో చల్లారిపోయాయి. దీనితో ఇప్పుడతను బ్యాక్ టు బేసిక్స్.. అంటూ.. తనకు సరిపడే పాత్రల ఎంపిక చేసుకుంటున్నాడు.
గతంలో సారీ నాకు పెళ్లయింది, ప్లీజ్ నాకు పెళ్లయింది వంటి శృంగార కామెడీ(?) చిత్రాలను రూపొందించిన దర్శకుడు గాంధీ ఒక సబ్జెక్ట్ చెప్పాడని, శివాజీ దానికి ఓకె చెప్పాడని తెలిసింది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి రాబోతోంది. హీరోయిన్, ఇతర కాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications