తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ పాలైన హీరో శ్రీ విష్ణు.. సీరియస్ అవడంతో హుటాహుటిన తరలింపు!
నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాణం సినిమాతో నటుడిగా పరిచయమైన తర్వాత సోలో హీరోగా కూడా అనేక సినిమాలు చేసి మినిమం గ్యారంటీ హీరో అనిపించుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా సరైన హిట్ సినిమా అందుకోవటం కోసం తెగ ప్రయత్నిస్తున్న ఆయన అనారోగ్య కారణాలతో హాస్పిటల్ పాలైనట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

బాణం సినిమాతో
బాణం సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీ విష్ణు సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. తర్వాత అనేక సినిమాల్లో అతిథి పాత్రలలో కూడా కనిపించిన ఆయన అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా జయమ్ము నిశ్చయమురా వంటి సినిమాల్లో మళ్లీ చిన్న పాత్రలు చేస్తూనే మా అబ్బాయి, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కధ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

డిజాస్టర్లు
నీది నాది ఒకే కథ సినిమాతో హిట్టు కొట్టిన శ్రీ విష్ణు తర్వాత వీరభోగ వసంత రాయలు అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. మళ్ళీ బ్రోచేవారెవరురా సినిమాతో హిట్టు కొట్టిన ఆయన తిప్పరా మీసం, గాలి సంపత్, రాజరాజ చోర, అర్జున ఫాల్గుణ, లాంటి వరుస సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నాడు.

హాస్పిటల్ పాలై
ప్రస్తుతం శ్రీ విష్ణు అల్లూరి అనే ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జయంతికి ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. మరి కొద్ది రోజుల్లో సినిమాని విడుదల చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన హాస్పిటల్ పాలైనట్లు టాలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం.

శ్రీవిష్ణుకి చికిత్స
గత కొద్దిరోజుల క్రితం ఆయనకు డెంగ్యూ సోకినట్లు సమాచారం. అయితే డాక్టర్ల సలహాలతో ముందు ఇంటి దగ్గరే చికిత్స తీసుకున్నప్పటికీ ప్లేట్లెట్స్ కౌంట్ దారుణంగా పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలుస్తోంది. హాస్పిటల్లోనే ది బెస్ట్ వైద్యుల సమక్షంలో శ్రీవిష్ణుకి చికిత్స జరుగుతోందని అంటున్నారు.

డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు
ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు కానీ త్వరలోనే ఆయన కోల్కొని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే శ్రీ విష్ణు హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆందోళనకు గురవుతున్నారు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని వీలైనంత త్వరలో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇబ్బంది తప్పిందని
నిజానికి ఆయనకు వచ్చినది వైరల్ ఫీవర్ అనే భావించి ముందుగా జాగ్రత్తలు తీసుకోలేదని తర్వాత బాగా నీరసమై పడిపోయే పరిస్థితుల్లో హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో ఆయన టెస్టులు చేసిన వైద్యులు అది డెంగ్యూ గా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో డెంగ్యూ కి సంబంధించిన చికిత్స ప్రస్తుతం ప్రారంభించారు. డెంగ్యూ సోకితే ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది అన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి అది ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శ్రీ విష్ణు విషయంలో దాన్ని ముందే గుర్తించడంతో ఆయనకు ఒక రకంగా ఇబ్బంది తప్పిందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











