తప్పకుండా చెయ్యాలి అనుకున్నా..!
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ సినిమా కధ వివేక్ చెప్పినప్పుడు ఏం అర్ధం కాలేదు చాలా కన్ఫుజ్ అనిపించింది.,మళ్ళి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళి కలిసి ఇది వర్క్ఔట్ అవుతుందా అంటే
Recommended Video

పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్త్రిలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి మరో ప్రయోగాత్మక చిత్రం ''మెంటల్ మదిలో '' శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేసారు. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ సినిమా కధ వివేక్ చెప్పినప్పుడు ఏం అర్ధం కాలేదు చాలా కన్ఫుజ్ అనిపించింది.,మళ్ళి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళి కలిసి ఇది వర్క్ఔట్ అవుతుందా అంటే వివేక్ చెప్పిన మాట ఫస్ట్ హాఫ్ నా వెర్షన్,సెకండ్ హాఫ్ నీ వెర్షన్ అని వుంటుంది అని అన్నాడు. మరి సినిమా జనాలకు అర్ధం అవుతుందా అంటే మనకంటే సినిమా చూసే వాళ్ళే తెలివైన వాళ్ళు అని అన్నాడు.
ఆ మాట విన్నాక ఈ సినిమా తప్పకుండా చెయ్యాలి అని అనుకున్నాను. ఇందులో న్యూస్ పేపర్ కి కూడా కారెక్టర్ పెట్టిండు విడేవ్వడ్రా బాబు అనుకుంటున్నారు అని అంటూ సినిమా గురించి మాట్లాడారు. శివాజీ రాజాగారు నిజంగానే నాకు తండ్రి అనే ఫీలింగ్ వచ్చేసింది సినిమా చూస్తుంటే అయన టైమింగ్ బాగుంటుంది అని శ్రీవిష్ణు అన్నారు.


Click it and Unblock the Notifications











