‘మా’లో ముదిరిన వివాదం: హీరో శ్రీకాంత్ ఓపెన్ ఛాలెంజ్, ప్రెస్‌మీట్‌కు నరేష్ డుమ్మా!

By Bojja Kumar

Recommended Video

Movie Artists Association Press Meet

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా)లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో వివాదం ముదురుతోంది. 'మా' ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ నరేష్ అకౌంట్స్ పుస్తకాలు చెక్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అమెరికాలో చిరంజీవితో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్యక్రమం విషయంలో డబ్బు దుర్వినియోగం జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో నిధుల దుర్వినియోగం వెనక హీరో శ్రీకాంత్ ఉన్నట్లు మీడియాలో స్క్రోలింగ్ రావడంతో ఆయన ఇతర సభ్యులతో కలిసి సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

 చిరంజీవి స్టామినా ఇంతేనా?

చిరంజీవి స్టామినా ఇంతేనా?

చిరంజీవితో ప్రోగ్రాం చేస్తే చాలా తక్కువ డబ్బులు వచ్చాయని అంటున్నారు....ఆయన స్టామినా ఇంతేనా? అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు వారు స్పందిస్తూ ఆయన స్టామినా లెక్కించే అర్హత మాకు లేదు. చిరంజీవి సపోర్టే మాకు స్టామినాగా ఫీలవుతాం. అమెరికాలో ప్రోగ్రాం నిర్వహించడానికి 50 మంది మెంబర్స్ వెళ్లాం. వారికి ఫ్లైట్ ఖర్చులు, లోకల్ ట్రావెలింగ్, ఫైవ్ స్టార్ హోటల్ ఖర్చులు చాలా అయ్యాయి. అన్నింటికీ లెక్కలు ఉన్నాయి. చిరంజీవి అన్నయ్య స్టామినా ఇంతేనా? అనేది సరైంది కాదు అన్నారు.

 మేము చాలా అడిగాం...

మేము చాలా అడిగాం...

చిరంజీవిగారు ప్రోగ్రాం కాబట్టి మేము చాలా డబ్బు అడగటం జరిగింది. కానీ వారు ఇంత అయితేనే ఇవ్వగలం అన్నారు. ఆ సమయంలో చాలా మంది చిరంజీవి గారు రారు అనే ప్రచారం కూడా చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో ఇంత పెద్ద కార్యక్రమం ఎవరూ చేయలేదు. డల్లాస్‌లో ఉండే వారిపై నమ్మకంతో వారికి ఆర్గనైజింగ్ బాధ్యత అప్పగించామని శ్రీకాంత్ తెలిపారు.

 ఆరోపణలు ఏమిటి?

ఆరోపణలు ఏమిటి?

ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, చిరంజీవి ప్రోగ్రామ్ అమెరికాలో విజయ్ అనే వ్యక్తి సెట్ చేశాడు. సెట్ చేసినందుకు రామకృష్ణ రాజు అనే వ్యక్తి ద్వారా రూ. 80 లక్షలు బినామీ అకౌంట్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని మీడియా వారు ప్రశ్నించారు.

ఆ సంగతి మాకు తెలియదు

ఆ సంగతి మాకు తెలియదు

మీరు చేస్తున్న ఆరోపణల గురించి మాకు తెలియదు. అగ్రిమెంట్ ప్రకారం ‘మా'కు ఎంత చెల్లించాలో..... అమెరికాలో ప్రోగ్రాం ఆర్గనైజింగ్ చేసిన వారు చెల్లించారు. ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

నాకు సంబంధం లేదు

నాకు సంబంధం లేదు

అసోసియేషన్లో యూఎస్ఏకు సంబంధించిన అమౌంట్ మిస్ యూజ్ చేశారని వార్తలు వచ్చాయి. అందులో నా పేరు కూడా వస్తోంది. వాస్తవానికి నేను హెల్పింగ్ వరకే ఉంటాను. లెక్కలు అన్నీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చూసుకుంటారు. టీవీలో ఆ వార్త చూడగానే వెంటనే నరేష్ గారికి ఫోన్ చేశాను అంటూ..... శ్రీకాంత్ తెలిపారు.

ఆయన రమ్మంటే రాలేదు

ఆయన రమ్మంటే రాలేదు

నిన్న నరేష్ గారికి ఫోన్ చేశాను. 45 నిమిషాలు మాట్లాడాను. నరేష్ గారు సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీ మీది. ఎందుకంటే స్క్రోలింగులో నా పేరు వస్తోంది. ఖండించడం నా బాధ్యత. యూఎస్ఏ ప్రోగ్రాం అగ్రిమెంట్ చదివింది మీరు, సైన్ చేసింది మీరు. రేపు పొద్దున ప్రెస్ మీట్ ఉంది, రావాలని చెప్పాను. ఇప్పుడెందుకమ్మా ప్రెస్ మీట్... నిన్నే కదా మేమంతా మీడియాను కలిసి అన్నీ చేశామని అన్నారు. మీరు ఏం చెప్పారో నాకు తెలియదు. ఆ తర్వాత కూడా నా పేరు వస్తోంది. నా ఎదురుగుండా మీరు వచ్చి నాకు క్లారిటీ ఇవ్వండి అన్నాను. కానీ ఆయన రాలేదు.. అని శ్రీకాంత్ తెలిపారు.

డబ్బు వచ్చిందా? లేదా? అదే ముఖ్యం

డబ్బు వచ్చిందా? లేదా? అదే ముఖ్యం

అగ్రిమెంటు ప్రకారం మీకు డబ్బులు వచ్చాయా? లేవా? డబ్బు వచ్చినపుడు ఆర్గనైజర్ల గురించి మనకెందుకు? వాళ్లకు లాస్ వచ్చినా మనం ఇవ్వం, వాళ్లకు ప్రాఫిట్ వచ్చినా మనం తీసుకోం. అగ్రిమెంటు మీద రూ. కోటి ఉందా? రెండు కోట్లు ఉందా? మూడు కోట్లు ఉందా? వచ్చిందా? లేదా? అనేదే లెక్క. దాని తర్వాత వాళ్లెంత లాభం పొందారు? వాళ్లు ఎక్కడి నుండి పెట్టారు? ఎన్ని సీట్లు ఫిల్ చేశారు? ఇవన్నీ మాకు అనవసరం. మన డబ్బులు మనకు వచ్చాయా? లేదా? అనేదే ముఖ్యం.... అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

 శ్రీకాంత్ ఓపెన్ చాలెంజ్

శ్రీకాంత్ ఓపెన్ చాలెంజ్

నిధులు దుర్వినియోగం అయినట్లు ఎవరైతే ఆరోపణలు చేశారో... అగ్రిమెంటు కంటే ఐదు పైసలు తక్కువ వచ్చి ఉన్నా నేను ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గడపకూడా తొక్కను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ షిప్ కూడా కేన్సిల్ చేసుకుంటాను. ఇది నా ఓపెన్ చాలెంజ్... అదే వారు ప్రూవ్ చేయకపోతే నేను చేసే పని చేస్తారా? అంటూ శ్రీకాంత్ ప్రశ్నించారు.

రెండు గ్రూఫులు ఉన్నాయా?

రెండు గ్రూఫులు ఉన్నాయా?

‘మా' అసోసియేషన్లో రెండు గ్రూఫులు ఉన్నాయా? అనే ప్రశ్నకు పరుచూరి వెంకటేశ్వరరావు స్పందిస్తూ.... అలాంటివేమీ లేవని స్పష్టం చేశారు. నరేష్ ఎందుకు రాలేదు అంటే... ఆయన షూటింగులో ఉండటం వల్ల రాలేదని తెలిపారు.

మా టార్గెట్ పది కోట్లు

మా టార్గెట్ పది కోట్లు

సంవత్సరన్న క్రితం మేము చార్జ్ తీసుకున్నపుడు ‘మా' లో రూ. 2 కోట్ల రూ. 10 లక్షలు ఉన్నాయి. ఇపుడు రూ. 5 కోట్ల 60 లక్షలు ఉంది. ఇంకా మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్ ఫంక్షన్ చేస్తే రూ. 10 కోట్లు వస్తాయని అంచనా ఉంది. అదే మా ఎయిమ్ కూడా. పది కోట్ల పెట్టి బ్రహ్మాండమైన భవనం కట్టి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నామని.... పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X