కరోనాపై పోరాటం.. సీసీసీకి హీరో శ్రీకాంత్ విరాళం
దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రణాళికలు రచిస్తున్నాయి. లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలను ఇల్లుదాటి బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని నిరోధిస్తున్నాయి.
మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలుస్తూ కరోనా పట్ల ప్రజల్లో అవగాహన నింపుతున్నారు. సీఎం, పీఎం సహాయ నిధులకు ఆర్థిక సాయం చేయడమే గాక సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు. చిరంజీవి సారథ్యంలో ఏర్పడిన ఈ ఛారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు తెలుగు సినీ తారలు.

ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ సహా ఎందరో సినీ హీరోలు ఈ ఛారిటీకి భారీ విరాళాలు అందించగా.. తాజాగా హీరో శ్రీకాంత్ ముందుకొచ్చారు. తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందజేసారు శ్రీకాంత్. సరైన సమయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న పెద్దలందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన శ్రీకాంత్.. ఆ తర్వాత విలన్ క్యారెక్టర్స్ చేసి కూడా మెప్పించారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమాలో కూడా ఈయనే విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











