twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకాంత్ కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు... మరీఇంత ధైర్యమా

    |

    అన్ని ఫ్యామిలీ సినిమాలే కదా మనోడు అంతే సాఫ్ట్ అనుకుంటున్నారా.... మధ్యలో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు కూడా వచాయ్... మర్చిపోకండి. సినిమాల్లో సాఫ్టే గానీ నిజజీవితం లో మాత్ర శ్రీకాంట్ కి కాస్త దూకుడెక్కువే. అసలే ఈ మధ్య ఎక్కువగా సినిమాలు లేకపోవటం తో ఒక సారి అలా యాత్రకెళ్ళోచ్చాడట...

    యాత్రంటే మామూలు యాత్ర అనుకునేరు ప్రపంచం లోనే ఎత్తయిన రోడ్డు మీద డ్రైవింగ్ చేసొచ్చాడట. అంత ఎత్తైన రోడ్డు అంటే ఏ విదేశాల్లోనో కాదు మన దేశం లోనే ఉంది. ఈ రోడ్డుని శ్రీకాంట్ సొంత డ్రైవింగ్ లోనే దాటాడట..

    Hero Srikanth finshes adventure road trip from Hyderabad to Leh Ladakh

    ఎంతోకాలంగా అనుకుంటున్న లాంగ్ రోడ్ డ్రైవ్ కోరికను శ్రీకాంత్ ఈ నెలలో తీర్చుకున్నారు. తన చిన్ననాటి స్నేహితులు నలుగురుతో కలిసి శ్రీకాంత్ జున్ 17న హిమాలయాలకు రోడ్ ట్రీప్ బయలుదేరి పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టి వచ్చారు. ఢిల్లీ, శ్రీనగర్ మీదుగా కార్గిల్‌కు వెళ్ళి... అక్కడి అమరవీరుల సమాధి దగ్గర నివాళులు అర్పించారు శ్రీకాంత్.

    Hero Srikanth finshes adventure road trip from Hyderabad to Leh Ladakh

    అతి ప్రమాదకరమైన ఘాట్ రోడ్‌లో శ్రీకాంత్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం సాగించారు. మోటర్ వాహనాల ద్వారా ప్రయాణం చేయగల ప్రపంచంలోని ఎత్తైన ( 18380 అడుగులు) ప్రదేశం ఖర్దుంగ్లాను శ్రీకాంత్ మిత్ర బృందం దర్శించింది. అదే దారిలో సెకండ్ హయ్యెస్ట్ పాస్ ఆఫ్ ద వరల్డ్ టగ్లాంగలానూ వీరు చూసొచ్చారు. లడక్ నుండి లే కు వెళ్ళి... అక్కడ నుండి మనాలి మీదగా హైదరాబాద్ చేరారు. చిరకాల కోరిక తీరిపోయినందుకు ఆనందంగా ఉన్నా. ఆ పది రోజుల ఘాట్ రోడ్ ట్రిప్‌ను తలుచుకుంటే... ఇప్పుడు మాత్రం భయమేస్తుందట...

    English summary
    Hero Srikanth , who is on an adventurous road trip from Hyderabad to Leh and then Ladakh to Hyderabad. The family Hero reached Khardungla Top which is situated at 18380 Feet height from the sea level. Khadungla Top is the highest Motorable Road in the World
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X