భగవద్గీతను ఫాలో అవుతున్న హీరో శ్రీకాంత్ ..
తాజ్ మహల్, పెళ్లి సందడి, క్షేమం గా వెళ్లి లాభం గా రండి వంటి ఎన్నో ఫామిలీ చిత్రాలలో నటించి మంచి ఫ్యామిలీ హీరో గా ముద్రవేసుకున్నాడు హీరో శ్రీకాంత్. ఖడ్గం, మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్ లాంటి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు కూడా చేసి తనలోని విలక్షణ నటుడుని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. అలాగే ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం లో స్థానం సంపాదించుకున్నాడు. కాలానికి అనుగుణంగా మారుతూ హీరో పాత్రలే కాకుండా మంచి క్యారెక్టర్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. శంకర్ దాదా జిందాబాద్, గోవిందుడు అందరివాడు, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించాడు.

తాజాగా తన స్వీయ సమర్పణలో అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మాతగా కరణం బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ 2019లో నటిస్తున్నాడు. సమాజానికి మంచి చేయాలన్న ఉదేశ్యం తో బయలుదేరిన వ్యక్తికి రాజకీయ నాయకులూ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రజల నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకు భగవద్గీతలోని సామ దాన దండోపాయాలు ఉపయోగించి రాజకీయ నాయకులకు వారిని ఎన్నుకునే ప్రజలకు వారి వారి బాధ్యతలు గుర్తు చేసే పాత్రలో కనిపించనున్నారు.

సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంగా ఎన్నికల మీద ఒక విభిన్న కథాంశం తో అతి త్వరలో మన ముందుకు వస్తున్న చిత్రం ఆపరేషన్ 2019.ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ మా ఆపరేషన్ 2019 టీం తరపున ప్రేక్షక దేవుళ్ళకి నటుడు శ్రీకాంత్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











