హీరో శ్రీకాంత్ భూమి కబ్జా..స్టేషన్ లో కంప్లైంట్
హీరో శ్రీకాంత్‌కు చెందిన భూమిని కబ్జా చేసారు. ఈ భూమిలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు జెండాలు పాతారు. శంకరపల్లి మండలం దొంతనపల్లిలో సర్వే నం. 21, 23 భూమిలో గురువారం మధ్యాహ్నం జెండాలు పాతి కబ్జాకు పాల్పడ్డారు..దొంతెనపల్లిలో శ్రీకాంత్‌కు 3 ఎకరాల 19 గుంటల భూమి ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రావాలాకు చెందిన భూములను ఆక్రమించుకుంటామని నినాదాలు చేశారు. శంకరపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు శ్రీకాంత్ వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్...జీవి దర్శకత్వంలో రంగ..ది దొంగ, వి.సముద్ర దర్శకత్వంలో సేవకుడు చిత్రం చేస్తున్నారు. ఇక ఇన్నాళ్లూ తెరపై అన్యాయాలను ఎదుర్కొన్న ఈ హీరో నిజ జీవితంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడనది అందరికీ ఆసక్తికరమే.


Click it and Unblock the Notifications











