హీరో శ్రీకాంత్ కూతురు లేటెస్ట్ లుక్ వైరల్.. అందానికే అందం అనేలా.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు మార్కెట్ ను కోల్పోయినప్పటికి కూడా ప్రేక్షకులు మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి అతికొద్ది మంది మంచి నటులల్లో హీరో శ్రీకాంత్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో మంచి ఓపెనింగ్స్ అందుకునేవి. ఇక ప్రస్తుతం విభిన్నమైన సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్ మరింత ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ కూతురు అందంగా అందరిని స్టన్ అయ్యేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు లవర్ బాయ్ గా..
సీనియర్ హీరో శ్రీకాంత్ ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను మొదట విలన్ గా అవకాశాలు అందుకున్నాడు. అనంతరం మెల్లగా సైడ్ హీరోగా చేసి మేయిన్ హీరోగా గుర్తింపును అందుకున్నాడు.

మంచి ఫ్యాన్ ఫాలోవర్స్
శ్రీకాంత్ అప్పట్లో ఈవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి టాలెంటెట్ దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన పెళ్లి సందడి సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా లేడీస్ లో శ్రీకాంత్ కు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగారు. కొని థియేటర్స్ లో శ్రీకాంత్ సినిమాలు మహిళల కోసం అన్నట్లుగా ఉండేవి. అంతలా క్రేజ్ సాధించాడు.

హీరోయిన్ తో లవ్ మ్యారేజ్
ఇక శ్రీకాంత్ 1997లో హీరోయిన్ ఉహను పెళ్లి చేసుకున్నాడు. ఊహ కూడా మంచి నటిగా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంది. ఆమె తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలలో కూడా చాలా మంచి సినిమాలు చేసింది. ఇక శ్రీకాంత్ ఆమె అనే సినిమాలో నటించిన అనంతరం ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం తొందరగానే పెళ్లి చేసుకున్నారు.

ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా
ఇక శ్రీకాంత్ ను పెళ్లి చేసుకున్న అనంతరం ఊహ సినిమాలకు దూరమైంది. ముగ్గురు పిల్లలు జన్మించడంతో పూర్తిగా ఆమె ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయ్యారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు రోషన్ , రోహన్ .. ఒక అమ్మాయి మేధ ఉన్నారు. ఇప్పటికే రోషన్ హీరోగా మంచి గుర్తింపు అందుకుంటున్నాడు. పెళ్లి సందD కి మంచి గుర్తింపు లభించింది.

ఊహ కూతురు ఫిక్స్ వైరల్
శ్రీకాంత్, ఊహ ఇటీవల వారి 25వ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకోవడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అందులో ఊహ కూతురు మేధ చాలా అందంగా కనిపిస్తోంది. తల్లి తరహా అందమే ఆమెకు కూడా వచ్చినట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్ గా ఎంట్రీ..?
రీసెంట్ గా కాలేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టిన మేధ నటిగా ఏమైనా ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఆమె మంచి క్రేజ్ అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక రోషన్ పెళ్లి సందడి సక్సెస్ అయిన అనంతరం మరిన్ని మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక మరో చిన్న కుమారుడు రోహన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











