నా పేరు వాడారని చెప్పట్లేదు, ఆ సినిమా చాలా ఇష్టం.. మధ్యలోనే ఆపేసి, మహేష్ ఏమన్నాడంటే!
Recommended Video

సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ ని ఉద్దేశించి మహేష్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహెష్ కొత్త గెటప్ అభిమానులని సమ్మోహన పరిచిందని చెప్పొచ్చు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడివల్లి ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. జెంటిల్ మాన్ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన ఖాతాలో అష్టాచమ్మా, జెంటిల్ మాన్ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.

మహేష్ రావడంతో ఆ భయం పోయింది
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఈవెంట్ కు రావడంతో సమ్మోహనం చిత్రంపై తనకు ఉన్న చిన్న భయం పోయిందని సుధీర్ తెలిపాడు. మంచి సినిమా తీసాం. జనాలకు రీచ్ అవుతుందా లేదా అనే భయం ఉండేది. మహేష్ బాబు కొత్త గెటప్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావడం వలన ఆ భయం పోయిందని సుధేర్ తెలిపాడు. ఇప్పుడు సమ్మోహనం చిత్రం గురించి అందరికి తెలిసిందని అన్నాడు.

మాట్లాడలేకపోయిన సుధీర్
తన ప్రసంగం మధ్యలో సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యాడు. మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేశాడు. సమ్మోహనం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యాడు.

అక్కడ ఇరగ్గొట్టేస్తాడు, కానీ
సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ.. సుధీర్ తన ఫంక్షన్స్ కి వచ్చి ఇరగ్గొట్టేస్తాడు అని కానీ తన ఈవెంట్స్ లో మాత్రం ఎమోషనల్ అయిపోతున్నాడని మహేష్ తెలిపాడు.

నాకు బాగా నచ్చిన చిత్రం
సమ్మోహనం చిత్రం గురించి మాట్లాడుతూ విడుదలకు ముందే పాజిటివ్ బజ్ వినిపిస్తోందని మహేష్ తెలిపాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రాలలో అష్టాచమ్మా చిత్రం చాలా ఇష్టం అని మహేష్ తెలిపాడు. ఆ చిత్రంలో తన పేరు వాడారని చెప్పడం లేదని నిజంగానే ఆ సినిమా చాలా ఇష్టం అని మహేష్ అన్నాడు.

నా పనిలో నేను బిజీగా
తన పనిలో తాను బిజీగా ఉండడం వలన సుధీర్ బాబుకు తాను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదని, ఇలా తన చిత్ర ఈవెంట్స్ కు మాత్రమే హాజరయ్యాని మహేష్ తెలిపాడు. సుధీర్ తన హార్డ్ వర్క్ తోనే ఈ స్థాయికి వచ్చాడని మహేష్ ప్రశంసించాడు.


Click it and Unblock the Notifications











