కార్తీకేయ నాకు బ్రదర్ లాంటి వాడు.. రాజా విక్రమార్క ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు ఎమోషనల్
కార్తికేయకు జంటగా నూతన కథానాయిక తాన్యా రవిచంద్రన్ నటించిన రాజా విక్రమార్క సినిమాలో భారీ అంచనాలు పెంచేసింది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఎన్.ఐ.ఏ ఏజెంట్ పాత్రలో కార్తికేయ నటించారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుధీర్ బాబు, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సుధీర్ బాబు మాట్లాడుతూ...
సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానిస్తే తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాం. శ్రీదేవీ సోడా సెంటర్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నేను వస్తానని చెప్పాను. ఎందుకంటే కార్తీక్ తన తొలి సినిమా రిలీజ్ తర్వాత తనతో ఓ మాట చెప్పారు. తనకు బ్రదర్‌లా ఉన్నారని చెప్పడంతో అప్పటి నుంచి కార్తీకేయతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను హీరో సుధీర్ బాబు చెప్పారు.

సినిమాలో కోసం నేను సిక్స్ ప్యాక్, ఫిజికల్‌గా ప్రయత్నిస్తుండటంతో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటి ప్రయత్నమే కార్తీకేయ చేశాడు. అందుకే నాకు ఆయన అంటే నాకు ఇష్టం. కార్తీకేయ సక్సెస్ సాధిస్తే నేను హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇది సినిమా వేదిక మీద నుంచి చెప్పడం కాదు.. నా హృదయపూర్వకంగా చెబుతున్నాను అని సుధీర్ బాబు అన్నారు.
రాజా విక్రమార్క ట్రైలర్ చూసిన తర్వాత విజువల్స్ నన్ను ఎంతో ఆకట్టుకొన్నాయి. ఈ డైరెక్టర్ శ్రీ సారిపల్లిని ఎలా మిస్ అయ్యానురా అని అడిగితే.. మన వద్దకు వచ్చాడని చెప్పారు. గతంలో నా స్నేహితుడి ద్వారా శ్రీ సారిపల్లి నేను కలిశాను. ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని సుధీర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











