అభిమానులకు హీరో సుధీర్ బాబు గిఫ్ట్... ఏంటో తెలుసా?
సుధీర్‌బాబు బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ జంటగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రానికి సమ్మోహనం టైటిల్ ఖరారు చెయ్యడం జరిగింది. ఇటీవల విడుదలైన సమ్మోహనం సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
యువహీరో సుధీర్‌బాబు బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదరీ జంటగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రానికి సమ్మోహనం టైటిల్ ఖరారు చెయ్యడం జరిగింది. ఈ సినిమాలో ఫీల్ గుడ్ ఫిల్మ్. ప్రేమ, వినోదం ప్రధానాకర్షణలుగా నిలువనున్నాయి.

ఇటీవల విడుదలైన సమ్మోహనం సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే ఈ సినిమాలోని తొలి పాటను హీరో సుధీర్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 11న విడుదల చేయనున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించడం జరిగింది.
హిమాచల్ ప్రదేశ్, ముంబై ప్రదేశాల్లో ఈ చిత్రం లోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. పెళ్లిచూపులు సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పీజీ విందా ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











