twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రైవర్ రాముడు టీజర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు

    By Rajababu
    |

    నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరోగా రాజ్ స‌త్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం 'డ్రైవర్ రాముడు'. ఇటీవలే మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైన మొదటి ప్రచార చిత్రం సినిమా అంచనాలను రేటింపు చేసింది. ఇప్పుడు సినిమా కు సంబంధించి మొదటి టీజర్ ను విడుదల చేసారు. సక్సెస్ ఫుల్ హీరో సుధీర్ బాబు డ్రైవర్ రాముడు మొదటి టీజర్ ను విడుదల చేసారు.

    తర్వాత సుధీర్ బాబు మాట్లాడుతూ "నాకు కమెడియన్స్‌లో నచ్చిన నటుడు షకలక శంకర్. ఒక్క సినిమా తో షకలక శంకర్ కమెడియన్‌గా ఉన్నాడు అంటే ఆ చిత్రం లోని కామెడీ ఖచ్చితంగా బాగుంటుంది, ఇప్పుడు తాను హీరోగా వస్తున్నాడు అంటే ఈ చిత్రంలో కామెడీ అద్భుతంగా ఉంటుంది అని అర్ధం అయింది. ఈ డ్రైవర్ రాముడు చిత్రం టీజర్ నేను విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలైన వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్‌లకు మరియు దర్శకుడు రాజ్ స‌త్యకి నా శుభాకాంక్షలు. డ్రైవర్ రాముడు సినిమా మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

    Hero Sudheer Babu released

    ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్‌లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంక‌ర్ మార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మా సినిమా టీజర్ ను సుధీర్ బాబు గారు రిలీజ్ చేయటం మా అదృష్టం. సినిమా ప్రేక్షకులందరికీ నచుతుంది" అని తెలిపారు.

    నిర్మాతలు మాట్లాడుతూ "మా డ్రైవర్ రాముడు సినిమా టీజర్‌ని సుధీర్ బాబు గారు విడుదల చేయటం మా అదృష్టం. వారు టీజర్ ని చూసి చాలా బాగుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని కొనియాడారు. ఈ సినిమా విడుదల సమయానికి సుధీర్ బాబు గారికి ప్రత్యేకమైన షో వేస్తాము. త్వరలోనే సినిమా విడుదలకు అని కార్యక్రమాలు పూర్తి చేస్తాము" అని తెలిపారు. ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.

    బ్యానర్- సినిమా పీపుల్స్
    సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్
    మ్యూజిక్ - సునీల్ కశ్యాప్
    ఆర్ట్ - రఘు కుల్ కర్ణి
    డిఓపి - అమర్ నాథ్
    నిర్మాతలు - వేణు గోపాల్ కొడుమగుళ్ల , ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్
    దర్శకత్వం - రాజ్ సత్య

    English summary
    Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Driver Ramudu’ to be directed by newcomer Raj Satya. This movie teaser released by Hero Sudheer Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X