twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేల చూడకుండా డాన్స్ చేయగలిగే ఒకే ఒక్క హీరో చిరంజీవి.. జూ.ఎన్టీఆర్‌కి అందులో!

    |

    80, 90 దశకాలలో హీరో సుమన్ అద్భుతమైన విజయాలు అందుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీని ఇచ్చారు. అనుకోకుండా టాలీవుడ్ కు వచ్చి వరుస అవకాశాలు అందుకున్నారు. సుమన్ కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుమన్ చిత్ర పరిశ్రమ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సంధర్భంగా సుమన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, శేఖర్ కమ్ముల లాంటి సినీ ప్రముఖులపై ప్రశంసలు కురిపించారు.

     గొప్ప దర్శకుడికి పెద్ద దర్శకుడికి తేడా

    గొప్ప దర్శకుడికి పెద్ద దర్శకుడికి తేడా

    ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. పెద్ద సినిమాలు చేసినంత మాత్రాన తాను ఆ దర్శకుడిని గొప్ప దర్శకుడిగా భావించనని సుమన్ అన్నారు. తన దృష్టిలో గొప్ప దర్శకుడు అంటే.. ఎలాంటి ఇమేజ్ లేని కొత్త నటీనటులతో సినిమా చేసి హిట్ కొట్టినవాడే గొప్ప దర్శకుడు అని సుమన్ అభిప్రాయపడ్డారు. ఆల్రెడీ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్ చేస్తే అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే వాళ్లకు ఆల్రెడీ మార్కెట్ ఉంది.

    ఎందుకు ఈ కులాల గొడవ? నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!ఎందుకు ఈ కులాల గొడవ? నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    గొప్ప దర్శకుడంటే ఆయనే

    గొప్ప దర్శకుడంటే ఆయనే

    తన దృష్టిలో టాలీవుడ్ లో గొప్ప దర్శకుడు శేఖర్ కమ్ముల అని సుమన్ అన్నారు. ఆయన తెరకెక్కించే ప్రతి చిత్రంలోనూ కొత్త నటీనటులే ఉంటారని సుమన్ తెలిపాడు. కొత్త ముఖాలన్ని చూపిస్తూ రెండు గంటల పాటు ఆడియన్స్ ని కూర్చోబెట్టడం చాలా కష్టం అని సుమన్ తెలిపారు. ఎవరికీ తెలియని వారితో కూడా శేఖర్ కమ్ముల ఎన్నో చిత్రాలు తెరకెక్కించారని అభిప్రాయ పడ్డారు.

    గొప్ప నిర్మాత అంటే

    గొప్ప నిర్మాత అంటే

    తన దృష్టిలో గొప్ప నిర్మాత అంటే రామానాయుడు అని అన్నారు. ఇప్పుడున్న కొందరు నిర్మాతలు సినిమా చేయడమే కాదు.. విడుదల చేయడానికి కూడా తల్లడిల్లుతున్నారని సుమన్ తెలిపాడు. కానీ రామానాయుడు మాత్రం 100కి పైగా చిత్రాలని నిర్మించారని అన్నారు. రామానాయుడు నిర్మించినన్ని చిత్రాలు మరే నిర్మాతకు సాధ్యం కాదని అన్నారు. కాబట్టి రామానాయుడు గొప్ప నిర్మాత అదే సమయంలో పెద్ద నిర్మాత కూడా.

    ఇప్పుడున్న జనరేషన్‌లో

    ఇప్పుడున్న జనరేషన్‌లో

    ఇప్పుడున్న జనరేషన్ హీరోల గురించి తనకు పెద్దగా తెలియదని సుమన్ తెలిపారు. రాంచరణ్, అఖిల్ లాంటి యంగ్ జనరేషన్ హీరోలతో నేను ఇంకా నటించలేదు అని సుమన్ అన్నారు. నటించాక వారి గురించి చెబుతా అని సుమన్ తెలిపాడు. వారసత్వంతో వచ్చిన హీరోలు ఉన్నప్పటికీ సినిమా సినిమాకు నటనలో అద్భుతంగా రాటుదేలుతున్న వారు ఉన్నారని సుమన్ తెలిపాడు.

    కంటతడి పెట్టించేవాడే

    కంటతడి పెట్టించేవాడే

    తన దృష్టిలో అసలైన నటుడంటే థియేటర్స్ లో ఆడియన్స్ ని కంటతడి పెట్టించగలిగేవాడే అని అన్నారు. డాన్సులు, ఫైట్స్ ట్రైనింగ్ తీసుకుంటే ఎవరైనా చేస్తారు. కానీ వాళ్ళ నటన, డైలాగులు చెప్పే విధానంతో ఆడియన్స్ ని కళ్ళు చెమ్మగిల్లేలా చేయగలగడం చాలా కష్టం అని సుమన్ తెలిపాడు. నటన పరంగా నాకు కమల్ హాసన్, శ్రీదేవి అంటే చాలా ఇస్తామని తెలిపాడు. ఎలాంటి పాత్రకైనా వారు సరిపోతారు. ఎలాంటి కాస్ట్యూమ్ లో అయినా ఒదిగిపోతారు సుమన్ తెలిపాడు.

     మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే

    మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే

    మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి అద్భుతమైన ఆర్టిస్ట్. నేల కిందికి చూడకుండా డాన్స్ చేయగలిగే ఒకే ఒక్క హీరో చిరంజీవి అని సుమన్ ప్రశంసించారు. 150 సినిమాలు పూర్తయిన తరువాత కూడా ఆయన నటనలో డాన్సుల్లో పదును తగ్గలేదని సుమన్ తెలిపాడు. ఇక జూ. ఎన్టీఆర్ కు క్లాసికల్ డాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉందని తెలిపారు.

    మా జనరేషన్ హీరోయిన్లలో

    మా జనరేషన్ హీరోయిన్లలో

    తాను నటించిన హీరోయిన్లలో విజయశాంతి, భానుప్రియ అంటే ఇష్టం అని సుమన్ తెలిపాడు. భానుప్రియతో ఎక్కువ చిత్రాల్లో నటించా. ఏ సన్నివేశంలో ఎలా నటించాలి అనే సమన్వయం మా ఇద్దరి మధ్య బాగా ఉండేదని సుమన్ తెలిపారు. సుమన్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

    English summary
    Hero Suman Great words about Chiranjeevi, Kamal Haasan and Sridevi. Sekhar Kammula is great director says Suman
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X