ఇలాంటి సమయంలో ఓ మంచి సినిమా.. అక్కినేని హీరో కామెంట్
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. కెరీర్‌లో ఫీల్ గుడ్ మూవీస్‌లో నటించి ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సత్యం, గోదావరి, గోల్కోండ హైస్కూల్, మళ్లీ రావా వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అన్నింట్లోకెల్లా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా వచ్చి 14యేళ్లు అవుతున్న సందర్భంగా.. హీరో సుమంత్ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.
ప్రస్తుతం అంతా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఈ ఖాళీ సమయాన్ని అందరూ చక్కగా వినియోగించుకుంటున్నారు. సెలెబ్రిటీలందరూ కొత్త కొత్త వెబ్‌సిరీస్‌లంటూ వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని హీరో సుమంత్ ఓ సినిమాను సజెస్ట్ చేశాడు. తాను నటించిన ఓ చిత్రాన్ని చూడమని సలహా ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు.

గోదావరి చిత్రం రిలీజై నేటికి పద్నాలుగేళ్లు అవుతోంది. నాకు ఇప్పుడు ఎలాంటి పని లేదు కాబట్టి..నేటి ఉదయం కాఫీ సమయంలో నేను మళ్లీ ఈ సినిమా చూశాను. ప్రత్యేకంగా ఇలాంటి కఠిన సమయంలో ఈ సినిమా మళ్లీ ఏదో కొత్త ఫీలింగ్ కలిగించింది. మీరు ఇంత వరకు ఈ సినిమాను చూడకపోతే.. ఓ సారి చూడండి. కష్టకాలంలో ఓ మంచి సినిమా. శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు. జీ5, యూట్యూబ్‌లో ఉంద'ని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











