విజయభాస్కర్ డైరెక్షన్‌లో సుమంత్
స్రవంతి మూవీస్, విజయభాస్కర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలు స్రవంతి మూవీస్ బ్యానర్‌లో మేలిమి చిత్రాలుగా నిలిచిపోతాయి. తాజాగా ఆ కాంబినేషన్‌లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ఆయన మినహా స్రవంతి రవికిశోర్ నిర్మాతగా విజయభాస్కర్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.
మళయాలంలో పెద్ద హిట్ కొట్టిన క్లాస్‌మేట్స్ చిత్రాన్ని తెలుగులో సుమంత్, శర్వానంద్ ప్రధాన పాత్రలుగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. సుమంత్‌తో కలిసి స్రవంతి రవికిశోర్ గౌరి చిత్రం నిర్మించగా అది మంచి హిట్‌గా నిలిచింది.
స్రవంతి రవికిశోర్, విజయభాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన నువ్వే కావాలి చిత్రం కూడా మళయాలంలో వచ్చిన నీరమ్ చిత్రానికి రీమేక్. ఇప్పుడు మళ్లీ వారి కాంబినేషన్‌లో నువ్వే కావాలి అంత హిట్ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. తొందరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందని నిర్మాతలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications