కీర్తిరెడ్డి(తొలిప్రేమ ఫేమ్)ని వివాహమాడి, విడాకులు ఇచ్చిన సుమంత్ మరో సారి వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ పెళ్ళి కూతురు హార్వర్డ్ యూనిర్సిటీలో ఎమ్.ఎస్ చదువుతోంది. ఆమె ఐఐటి స్టూడెంట్. ఇరుపక్షాల పెద్దల అంగీకారంలో ఈ వివాహం నిర్చయం అయింది. డిసెంబర్ లో ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే ఏ మాత్రం హడావిడి లేకుండా ఈ వివాహం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక విడాకులు తీసుకుని చాలా కాలం అయినా సుమంత్ వివాహానికి అంగీకరించలేదు. కానీ తాతగారు అక్కినేని, మరికొందరు పట్టుదలతో అతన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుమంత్ తాను హీరోగా చేసిన బోణి చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు వారాల క్రిందట ఈ చిత్రం ఆడియో రిలీజైంది.