ఎన్టీఆర్ బయోపిక్.. ఏఎన్నార్ పాత్రకు ఎవరో తెలుసా!
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్, ఏఎన్నార్ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. అటువంటి గొప్ప నటుల అయిన ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ కలసి అనేక చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కలయికలో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి చిత్రాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి నటించారు.
ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఏఎన్నార్ పాత్ర ఎవరు పోషిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎట్టకేలకు ఆ ఉత్కంఠ తీరింది. ఏఎన్నార్ పాత్ర కోసం హీరో సుమంత్ ఎంపికయ్యాడు. సుమంత్ తాజగా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇటీవలే రానా కూడా తాను ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాని తెలిపాడు.

మహానటి చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ కోసం నిమ్మకూరు వెళ్లిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











