twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరాయివాడిగా చూడొద్దు, నేను తెలుగు వాన్ని: ఎమోషనల్ అయిన సందీప్ కిషన్

    తాను స్వచ్ఛమైన తెలుగువాడినని, కానీ ఈ మధ్య తాను కొన్ని తమిళ సినిమాలు చేయడంతో తనను పరాయివాడిలాగా చూస్తున్నారని సందీప్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    |

    తెలుగు సినిమాలతో తన కెరీర్ మొదలు పెట్టినా ఈ మధ్య ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్‌ను 'కేరాఫ్ సూర్య'కు కేటాయించడం మీద 'ఒక్కడు మిగిలాడు' టీమ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీన్నో డబ్బింగ్ సినిమాగా పేర్కొన్న నేపథ్యంలో హర్టయి నట్టున్నాడు సందీప్ అందుకే కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు.

    Recommended Video

    C/o Surya Teaser : Funny కేరాఫ్ సూర్య టీజర్
     పరాయివాడిలాగా చూస్తున్నారని

    పరాయివాడిలాగా చూస్తున్నారని

    తాను స్వచ్ఛమైన తెలుగువాడినని.. కానీ తనను పరాయివాడిలాగా చూస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మధ్య తాను కొన్ని తమిళ సినిమాలు చేయడంతో.. తాను తెలుగు సినిమాలకు దూరమైపోయినట్లు భావిస్తున్నారని.. తన కొత్త సినిమా ‘కేరాఫ్ సూర్య'ను తమిళ డబ్బింగ్ సినిమా అంటుండటం బాధ కలిగిస్తోందని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    డబ్బింగ్ సినిమా అయితే

    డబ్బింగ్ సినిమా అయితే

    ఇది తెలుగు సినిమా అని.. తెలుగు నుంచి తమిళంలోకి డబ్ అవుతోందని.. అంతే తప్ప తమిళం నుంచి తెలుగులోకి రావట్లేదని స్పష్టం చేశాడు సందీప్. నిజంగా ఇది డబ్బింగ్ సినిమా అయితే.. అలా చెప్పడానికి తనకు ఇబ్బందేమీ లేదని.. ‘నగరం' సినిమాను ద్విభాషా చిత్రం అని నిర్మాత చెప్పమన్నా తాను చెప్పలేదని.. డబ్బింగ్ సినిమా అనే చెప్పానని అన్నాడు సందీప్.

     రెండు భాషల్లో ఒకేసారి

    రెండు భాషల్లో ఒకేసారి

    "కేరాఫ్ సూర్య" రెండు భాషల్లో ఒకేసారి తీశామని.. ప్రధానంగా ఇది తెలుగులో చేసిన సినిమా అని అన్నాడు. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చి ఇక్కడ మార్కెట్ సంపాదించుకుంటున్నారని.. వారిని మన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని.. చెప్పిన సందీప్ కిషన్ తనను దూరం పెడుతున్నారన్న ఆవేదనని భరించలేకపోతున్నట్టున్నాడు.

    డబ్బింగ్ సినిమా అనొద్దు

    డబ్బింగ్ సినిమా అనొద్దు

    తమిళ హీరోలలాగే మనం కూడా పొరుగు భాషల్లో మార్కెట్ సంపాదించుకోవాలని తన లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నారని.. ద్విభాషా చిత్రాలు చేస్తున్నారని.. అలాంటపుడు దాన్ని మరోలా చూడకూడదని అన్నాడు సందీప్. ‘కేరాఫ్ సూర్య'ను డబ్బింగ్ సినిమా అనొద్దని, ఇది అచ్చమైన తెలుగు సినిమా అని చెప్పాడు సందీప్.

    English summary
    Young Hero Sundeep Kishan Who started his Career in Tollywood and now in Kollywood, Emotional Speech at His New Movie C/o Surya Pre Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X