పవన్ కళ్యాణ్ వల్లే అంతా పాజిటివ్‌గా జరుగుతోంది: సునీల్
Recommended Video

సునీల్, మనీషా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం 2 కంట్రీస్. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాను రూపొందించారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేశారు.
సునీల్ మాట్లాడుతూ...'ఈ సినిమా ఫస్ట్ టీజర్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు. అక్కడి నుండి అంతా పాజిటివ్ గానే జరుగుతోంది. ఇపుడు నాని వచ్చి ఈ ఆడియో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం సంతోషం. ఎందుకంటే ఆయన ఎయిర్ పోర్టులో షూటింగ్ చేసి అక్కడి నుండి బయల్దేరి ఇక్కడకు వచ్చారు. అప్పట్లో జక్కన్న ఫంక్షన్ సమయంలో చిరంజీవిగారు షూటింగ్ నుండి వచ్చారు. ఆయన తర్వాత నా కోసం షూటింగ్ నుండి వచ్చింది నాని మాత్రమే. నాని తమ్ముడూ... నువ్వు ఇప్పుడు సక్సెస్ అయినదానికంటే వందరెట్లు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు బావుండాలి... అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











