twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్ని కృష్ణ దర్శకత్వంలో సునీల్ ఖరారు

    By Srikanya
    |

    నా తదుపరి చిత్రం బి చిన్ని కృష్ణ దర్శకత్వం చేయబోతున్నాను.పూల రంగడు అనంతరం ఈ చిత్రం తెరకెక్కుతుంది.పెద్ద నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మిస్తుంది అన్నారు సునీల్ ఓ ప్రెస్ మీట్ లో. ఇంతకీ చిన్ని కృష్ణ అంటే స్టార్ రైటర్ చిన్న కృష్ణ కాదు. నిఖిల్ తో వీడు తేడా చిత్రం చేస్తున్న నూతన దర్శకుడు చిన్ని కృష్ణ. వివి వినాయిక్ శిష్యుడైన చిన్ని కృష్ణ తాజాగా చేస్తున్న వీడు తేడా చిత్రం విడుదలకు సిద్దమైంది.ఇక చక్రి సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని ప్రకాష్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక చిన్ని కృష్ణ నటుడుగానూ కొత్త బంగారులోకం చిత్రంలో కనిపించారు. అందులో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ వార్డెన్ గా కనిపిస్తాడు.

    ఇక నిఖిల్ రీసెంట్ గా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్లాప్ చిత్రం ఆలస్యం అమృతం లో చేసారు.ఇక సునీల్-ఇషా చావ్లా జంటగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొంద బోతున్న 'పూల రంగడు" ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పల్రాజు ప్లాపు తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు కామెడీ ప్రధానమైన పాత్రతో సునీల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    English summary
    "My next film after the completion of Poola Rangadu will be in the direction of B Chinni Krishna. A big production house will produce it," Sunil said in a press statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X