హీరో సునీల్ వీర్యం దానం చేయబోతున్నాడా?
దాదాపు సంవత్సరం తర్వాత మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, అయితే కథకు సరిపోయే కథానాయకుడు దొరకడం లేదని అంటున్నాడు మధుర్ శ్రీధర్. త్వరలోనే సబ్జెక్టుకు సూటయ్యే హీరోను వెతికి పట్టుకుంటానంటున్నాడు.
గతంలో ఈచిత్రం కోసం మధుర శ్రీధర్ హీరో నానిని సంప్రదించాడు. అయితే నాని బ్యాండ్ బాజా భారత్, జెండాపై కపిరాజు చిత్రాలతో బిజీగా ఉండటంతో హీరో రానాతో ఈచిత్రం చేయాలనుకున్నాడు. అయితే రానా కూడా రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో బిజీగా ఉండటంతో కుదరదనిచెప్పాడు. ప్రిన్స్ తో చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి కానీ...వర్కౌట్ కాలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మధుర శ్రీధర్ కన్ను కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్‌పై పడిందని, అతన్నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్. సునీల్ కూడా ఈ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, త్వరలోనే ఈ సినిమా విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












