twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్థరాత్రి చెన్నై వీధుల్లో.. ఆ టీ కొట్టు వద్ద..: సూర్య 'పెద్ద సాహసమే'?

    |

    Recommended Video

    అర్థరాత్రి చెన్నై వీధుల్లో.. సూర్య 'పెద్ద సాహసమే' ?

    సూర్య.. భావోద్వేగాలతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ధిట్ట. గజిని సినిమాతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న హీరో ఆయన. సింగం, సెవెన్త్ సెన్స్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య.. సంక్రాంతి బరిలో 'గ్యాంగ్'తో రాబోతున్నాడు. ఈ సందర్భంగా సూర్య చెప్పిన పలు ఆసక్తికర విషయాలు..

     సంక్రాంతి సినిమాల పోటీపై:

    సంక్రాంతి సినిమాల పోటీపై:

    నాకు తెలుసు.. సంక్రాంతికి తెలుగులో విపరీతమైన పోటీ ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణల సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి.

    వాటితో పాటే 'గ్యాంగ్' కూడా వస్తోంది. పోటీ అని అనను. ఎందుకంటే.. తమిళనాడుతో పోలిస్తే.. తెలుగునాట థియేటర్లు చాలా ఎక్కువ. ఇంచుమించుగా అక్కడి కంటే రెట్టింపు థియేటర్లు ఉన్నాయి. కాబట్టి అన్ని సినిమాలకూ మంచి ఛాన్స్ ఉంది.

    రీమేక్ చేయడంపై:

    రీమేక్ చేయడంపై:

    కొన్ని యథార్థ సంఘటనల సమాహారమే 'స్పెషల్ చబ్బీస్'. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయింది. అయితే ఈ కథను 'మనదైన కోణం'లో చెబుదామని దర్శకుడు విఘ్నేష్ నాతో అన్నారు. చెప్పినట్లే కొత్త కోణంలో సినిమా తీశారు.

    'స్పెషల్ చబ్బీస్' చూసినవాళ్లకు కూడా 'గ్యాంగ్' సినిమా కొత్తగా అనిపిస్తుంది. అయితే మూల కథను అనుసరించి తీసిన సినిమా కావడంతో.. కొన్ని సన్నివేశాలను యథాతంగా ఉంచాల్సి వచ్చింది.

     పాత రోజులు గుర్తొచ్చాయన్నారు?:

    పాత రోజులు గుర్తొచ్చాయన్నారు?:

    సినిమాల్లో బీజీ అయ్యాక కారులో తిరగడం కూడా తగ్గిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం కూడా మానేశా. ఎప్పుడూ విమానాలు, హోటల్స్.. ఇవి తప్ప మరో ప్రపంచమే లేకుండా పోయింది.

    దర్శకుడు విఘ్నేష్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. 'మీరు రోడ్డు బయట టీ తాగి ఎన్ని రోజులైంది?' అన్నాడు. ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయాను.

    నిజమే.. అనుకున్నాను:

    నిజమే.. అనుకున్నాను:

    విఘ్నేష్ ప్రశ్న నాకెందుకో మళ్లీ కొత్త అనుభూతినిచ్చింది. నిజమే.. రోడ్డు బయట టీ రుచి చూసి ఎన్నేళ్లయింది అనుకున్నాను. అదే మాట విఘ్నేష్‌ తో చెబితే.. 'మిమ్మల్ని మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లే కథ సార్ ఇది..' అన్నాడు. విఘ్నేష్ అప్రోచ్ భలే నచ్చింది.

     అర్థరాత్రి చెన్నై వీధుల్లో:

    అర్థరాత్రి చెన్నై వీధుల్లో:

    విఘ్నేష్ కథ చెప్పిన తర్వాత.. కొన్ని రోజుల పాటు అర్థరాత్రి చెన్నై వీధుల్లో టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగడం మొదలెట్టా. ఆ సమయంలో అక్కడి మనుషుల్ని, వాతావరణాన్ని నిశితంగా గమనించా. అవన్నీ 'గ్యాంగ్' సినిమాలోని నా పాత్రలో కనిపిస్తాయి.

    తొలి జీతం డబ్బులు..:

    తొలి జీతం డబ్బులు..:

    సినిమాల్లోకి రాకముందు ట్రాన్స్ పోర్టు కంపెనీలో పనిచేసేవాన్ని. నా తొలి జీతం రూ.726. అంతకుముందు ప్రతీ వారం నాన్న ఇచ్చే పది రూపాయల పాకెట్‌ మనీ కోసం చాలా ఆశగా చేతులు చాచేవాడిని.

    స్కూలుకి నడిచి వెళ్లేవాడ్ని. బస్సులు, ఆటో ప్రయాణాలు ఇవన్నీ తెలుసు. నలుగురితో కలిసి నడిస్తే సాధకబాధకాలు అర్థమవుతాయన్నది నాన్న గారి మాట. సినిమాల్లోకి వచ్చాక అదంతా గతం అయిపోయింది.

    తెలుగులో సినిమా ఎప్పుడు:

    తెలుగులో సినిమా ఎప్పుడు:

    ఈసారి తెలుగులో తప్పకుండా సినిమా చేస్తా అని చాలాసార్లు మాటిచ్చాను. ఈసారి చెప్పను. కథ, దర్శకుడు అన్నీ పక్కాగా కుదిరిన తరవాత, డేట్లు అన్నీ ఇచ్చేసిన తరవాత తెలుగు సినిమా గురించి నేనే మాట్లాడతా.

    English summary
    On the eve of Gang release on Jan 12th, Hero Suriya given an interview about the movie. He revelead some interesting facts behind this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X