రజనీ 'శివాజి' కలెక్షన్ తో పోల్చుకుంటున్న హీరో
"మా చిత్రం త్వరలో 'శివాజి' కలక్షన్లను చేరుకోబోతోంది. థియేటర్స్ అసోసియేషన్ వారు ఫోన్ చేసి, 'మంచి సినిమా ఇచ్చారు. మేమంతా హ్యాపీ. వసూళ్లు బాగున్నాయి' అంటున్నారు గజనీ సూర్య. ఆయన తమిళంలో నటించిన సింగం చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని తెలుగులో యముడు పేరుతో డబ్బింగ్ అవుతున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....ఈ రేంజి హిట్...మొదటిసారి అనుభవం. అలాగే 65ఏళ్ల బామ్మ నుంచి 5ఏళ్ల కుర్రాడు వరకూ ఈ సినిమా చూశామని చెప్పినప్పుడు అన్ని వర్గాలవారు చూస్తున్నారని తెలిసింది. ఇంతమంచి చిత్రం అందించినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.
ఈ చిత్రం కథ ప్రకారం పోలీస్ జాబ్ అంటే ఇష్టం లేని దొరై సింగం(సూర్య) తన తండ్రి మాటకోసం ఓ సబ్ ఇన్సెపెక్టర్ గా మారతాడు. పల్లె నుంచి వచ్చిన అతను నీతికి,నిజాయితీకి మారు పేరుగా ఉంటాడు. ఇక ఇన్సపెక్టర్ గా ప్రమోషన్ తెచ్చుకున్న సూర్య నల్లూరు అనే టౌన్ కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఆ ఏరియా డాన్ ప్రకాష్ రాజ్. అతనో కిడ్నాపర్, సొంత పంచాయితీలు చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూంటాడు. అతన్ని హీరో సూర్య ఎదుర్కొంటాడు. ఇద్దరి మధ్యా పిల్లా ఎలుకా ఆటలా ట్విస్ట్ లు, టర్న్ లతో కథ జరుగుతుంది.
ఇక మరో ప్రక్క నాజర్ కూతురు అనూష్క...టౌన్ ఫిల్ల..పల్లె వాడైన హీరో ప్రేమలో పడుతుంది. వివేక్ కామిడీ మరో ప్రక్క జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగతం వీటికి తోడై ధియోటర్ ని వేడిక్కిస్తుంది. ఇవన్నీ కలిసిన సింగం తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో యముడు పేరుతో డబ్బింగై. జులై 2న రిలీజవుతోంది.


Click it and Unblock the Notifications











