భర్త నష్ట పోకూడదనే జ్యోతిక అలా....!
హైదరాబాద్: హీరో సూర్యను పెళ్లాడిన తర్వాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న జ్యోతిక చాలా తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇన్నాళ్లు ఆమె ఇద్దరు పిల్లల పెంపకంలో మునిగిపోయారు. ఇపుడు పిల్లలు కాస్త పెద్దవారు కావడం, భర్త అంగీకారం కూడా ఉండటంతో మళ్లీ ఆమె సినిమాల వైపు దృష్టి సారించారు.
మళయాలంలో ఘన విజయం సాధించిన హౌ ‘ఓల్డ్ ఆర్ యు' చిత్రం తనకు సరిపోయే విధంగా ఉండటంతో దాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త సూర్య స్వయంగా తన సొంత బేనర్ 2డి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో జ్యోతిక సరసన రఘు నటిస్తున్నారు.

సాధారణంగా జ్యోతికకు షెడ్యూల్ షెడ్యూల్ మధ్య గ్యాప్ తీసుకునే అలవాటు ఉంది. గతంలో ఆమె సినిమాల్లో నటించేప్పుడు అలానే చేసేంది. అయితే ఇపుడు మాత్రం జ్యోతిక పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు గ్యాపే తీసుకోవడం లేదు. క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది. తమ సొంత బేనర్లో సినిమా కావడంతో సినిమా బడ్జెట్ పెరిగితే...నష్టపోయేది తామే కాబట్టి జ్యోతిక చాలా కష్టపడి పని చేస్తోందని అంటున్నారు. దీన్ని బట్టి జ్యోతికు భర్త అంటే బయం, భక్తి రెండు ఉన్నాయని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











