ఫ్యాన్స్ షాక్! బ్లాక్ మనీ స్కాంలో హీరో సూర్య పేరు

సదరు ముఠాలోని సభ్యులు హీరో సూర్య తమకు రెగ్యులర్ కష్టమర్ అని చెప్పుకుంటున్నారు. ఆయన భారీ మొత్తంలో తరచూ రూ. 50 నుంచి రూ. 100 కోట్ల మేర బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటారని, తమ కస్టమర్ల లిస్టులో టీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఉన్నాడని చెప్పుకోవడం గమనార్హం.
అయితే....ఈ ముఠా సభ్యులు సినిమా, రాజకీయ నాయకుల పేర్లను వాడుకుంటూ ఈ బ్లాక్ మనీ దందా నడిపిస్తున్నారా? లేక నిజంగానే వీరికి ప్రమేయం ఉందా? అనేది అంతు పట్టడం లేదు. అయితే హీరో సూర్య గురించి బ్లాక్ మనీ స్కాంలో వినిపించడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
సదరు ఛానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌పై.....పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. దీనిపై చట్టపరమైన విచారణ జరిగితే తప్ప ఈ బ్లాక్ మనీ ముఠా వెనక ఉన్న అసలు రహస్యాలు బయటపడే అవకాశం లేదు. మరి తన పేరు వినిపిస్తుండటంపై సూర్య ఎలా స్పందిస్తారో? చూడాలి.


Click it and Unblock the Notifications











