'ధ్రువ్' అనే పాత్రలో హీరో సూర్య
వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు గజిని, కాక్క కాక్క(తెలుగులో ఘర్షణ), వారణం ఆయిరమ్ అనే మూడు చిత్రాలు వచ్చాయి. తమిళంలో ఈ మూడూ సూపర్‌హిట్టే. సూర్యతోబాటు, నటుడు పార్తీబన్, ఇతర యూనిట్ సభ్యులు షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ధృవనక్షత్రంలో ఇతర నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదు. గురువారంనాడు సూర్యతో కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. సింగం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న సూర్య అక్కడ ఒక్కరోజు విరామం తీసుకుని ధృవనక్షత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు.
గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ.. సూర్య 'ధ్రువ్' అనే పాత్రలో నటిస్తున్నారు. కథకు నప్పుతుందనే ఉద్దేశంతో చిత్రానికి 'ధ్రువనక్షత్రం' అనే పేరుపెట్టాం. నా గత రెండు చిత్రాల్లో కనిపించిన సూర్యలా కాకుండా కొత్తగా చూడొచ్చని చెప్పారు. పార్తిబన్, సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. వచ్చేవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications












