»   » ఈమె నాగార్జున మేనకోడలు, చాలా గొప్పపని చేస్తోంది!

ఈమె నాగార్జున మేనకోడలు, చాలా గొప్పపని చేస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సామాజిక సేవ చేయడం అంటే గొప్ప పని చేయడమే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. తాజాగా ఇలాంటి గొప్పపని చేయడంతో వార్తల్లోకి ఎక్కింది నాగార్జున మేనకోడలు, హీరో సుశాంత్ చెల్లెల్లు సాహిత్య. ఇప్పటి వరకు సాహిత్య గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. సినిమా ఫ్యామిలీలో పుట్టినా ఆమె రంగుల ప్రపంచానికి ముందు నుండి దూరంగానే ఉంటూ వస్తున్నారు.

టీచ్ ఫర్ ఇండియా అనే సంస్థ కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తోంది సాహిత్య. పేద విద్యార్ధులకు చదువును అందించేందుకు ఏర్పడ్డ సంస్థ ఇది. హైద్రాబాద్ నుండి ఈ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను సాహిత్య చూసుకుంటోంది. ఇండస్ట్రీలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి తమ అనుభవాలను చెప్పి వారిలో స్ఫూర్తి నింపేందుకు తమ వంతు చేయడమే టీచ్ ఫర్ ఇండియా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

Hero Sushanth's sister goes NGO route

కూతురు చేస్తున్న మంచి పని చేసి తల్లి నాగ సుశీల మురిసిపోతోంది. 'చిన్నారుల కోసం నా కూతురు పడే తపన నన్ను గర్వపడేలా చేస్తోంది' అంటూ నాగ సుశీల ప్రశంసలు కురిపించింది. అయితే గతంలో సాహిత్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో వార్తల్లోకి ఎక్కింది. కానీ ఇపుడు ఒక మంచి పనితో వార్తల్లోకి ఎక్కారు.

English summary
Sahitya is associated with an NGO, which is aimed at giving quality education to under privileged children. "Teach For India" is the NGO we're talking about and Sahitya is an alumni of the organisation taking care of children's education here in Hyderabad. Her mother Naga Susheela expressed that she's proud of her daughter's work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu