twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతురు పుట్టడానికి ముందు రోజే చంపేశారు.. మా అమ్మ ఏడ్చేసింది.. తనీష్

    |

    బిగ్‌బాస్ తర్వాత హీరో తనీష్ నటిస్తున్న చిత్రం రంగు. బిగ్‌బాస్‌కు ముందే షూటింగ్ పూర్తయినప్పటికీ.. విడుదలలో జాప్యం ఏర్పడింది. నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రం విజయవాడలో సంచలన సంఘటనలకు కారణమైన లారా అనే రౌడీ షీటర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నది. భావోద్వేగాల సంగమంగా ఈ సినిమా తెరకెక్కిందని మీడియాతో తనీష్ అన్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ..

    ఎంచుకొన్న దారిలో తప్పులు

    ఎంచుకొన్న దారిలో తప్పులు

    నిజ జీవితంలో లారా అనే వ్యక్తి తన ఐడియాలిజీ పరంగా కరెక్ట్, కానీ తాను ఎంచుకున్న దారిలో తప్పు చేశాడు. తాను తీసుకున్న నిర్ణయాలు తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయనే విషయం తెలిసాక అతడిని ప్రత్యర్థులు చంపేస్తారు. లారా చనిపోయే సమయంలో ఆయన భార్య గర్బిణి. రేపు తన పాప పుడుతుంది అనగా ఈ రోజు రాత్రి అతన్ని చంపేస్తారు. ఆ సన్నివేశంలో నటించేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను అని తనీష్ చెప్పారు.

    చివరి అరగంట ఎమోషనల్‌గా

    చివరి అరగంట ఎమోషనల్‌గా

    రంగు సినిమా చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగాలతో నింపుతుంది. ఆ పాత్ర చేస్తున్నప్పుడు నేను కొన్ని సందర్బాలలో కనెక్ట్ అయ్యాను, నేనే కాదు చాలామంది కరెక్ట్ అవుతారు అని నమ్ముతున్నాను. ఈ సినిమా ఎలా ఉన్నా నా లైఫ్ లో మెమరబుల్ సినిమాగా ఉండిపోతుంది. ఎందుకంటే వందల సినిమాలు చేసిన పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాను సొంత సినిమాగా ఫీల్ అవుతున్నారు. అది నాకు గర్వంగా ఉంది అని తనీష్ తెలిపారు.

    దారుణంగా చంపారు.. భావోద్వేగం.. అసహాయత పరిస్థితుల్లో.. తనీష్దారుణంగా చంపారు.. భావోద్వేగం.. అసహాయత పరిస్థితుల్లో.. తనీష్

    అన్ని రకాల పాత్రల్లో నటిస్తా

    అన్ని రకాల పాత్రల్లో నటిస్తా

    ఇమేజ్, బ్రేక్‌లను నేను నమ్మను, రంగు తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథను కూడా నేను చేసి మెప్పించగలను. ఒక నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలనుకున్నాను. రంగు రిజల్ట్ మీద చాలా నమ్మకం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నా సినిమా రిజల్ట్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఎన్ని బ్యాడ్ ఫిల్మ్ చేసినా, ఒక మంచి సినిమాతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది తనీష్ పేర్కొన్నారు.
    వివాదాలు సృష్టించలేదు.

    కావాలని వివాదాలు సృష్టించలేదు.

    కావాలని వివాదాలు సృష్టించలేదు.

    రంగు సినిమా విషయంలో కావాలని వివాదాలు సృష్టించలేదు. అలా చేసి ఉంటే వాళ్లను పిలిచి చర్చలు జరిపే వాళ్లం కాదు. ఒక వివాదంగా మలిచి సినిమాపై క్రేజ్ పెంచాలనుకొంటే ఇంకా ఆ గొడవను పెంచేవాళ్లం. దర్శకుడు కార్తికేయ తనుచెప్పిన కథ కంటే తెర మీదకు అద్భుతంగా తీసుకొచ్చాడు అనే విషయాన్ని తనీష్ వెల్లడించారు.

    మా అమ్మ కన్నీళ్ళు

    మా అమ్మ కన్నీళ్ళు

    రంగు సినిమా ప్రివ్యూలో మా అమ్మ చివరిలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒక ఆర్టిస్ట్‌గా నేను ఆ సందర్భంలో నటుడిగా తృప్తి చెందాను. ఈ సినిమా నాకు చాలా గుర్తిండిపోయే చిత్రంగా మిగులుతుంది. రంగు సినిమాలో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతున్నాయి అని నమ్ముతున్నాను. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అని తనీష్ అన్నారు.

    English summary
    Bigg Boss2 contestatn Tanish's latest movie Rangu. He is doing a different movie. He revealed his character in the Rangu movie. This movie picturised on Vijayawada rowdy sheeter Lara. In this connection, Lara family member opposing on movie release. After solving the issues, Rangu set to release on November 23rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X