ఉదయ్ కిరణ్ సెల్ లో లాస్ట్ మెసేజ్ ఇదే...
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు భార్య విషితకు సెల్ లో మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ ఏమిటంటే...ఐ లవ్ యూ టూ అని. ఈ చివరి మెసేజ్ గురించే అంతా సానుభూతిగా చెప్పుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ సెల్ లో కాల్ డేటా ను పరిశీలిస్తున్నామని, పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంటుందని పోలీసులు అన్నారు.

సినిమా అవకాశాలు లేవని ఉదయ్‌కిరణ్ తనతో బాధ వ్యక్తం చేశారని.. తాను నచ్చజెప్పానని భార్య విషిత పోలీసులకు తెలిపారు. గత రెండ్రోజులుగా నిరాశతో ఉన్నారని చెప్పారు. బంధువుల పుట్టినరోజు వేడుకకు ఇద్దరం వెళ్లాల్సి ఉందని కానీ తను రానన్నాడని చెప్పారు. వేడుకల్లో ఉండగా ఉదయ్‌కిరణ్ నుంచి ఎస్‌ఎంఎస్ వచ్చిందని వివరించారు.
ఉదయ్‌కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అపోలో ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు తరలించారు. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యను అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. భార్య విషిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కుటుంబ వివాదాలు, సినీరంగంలో ఒత్తిళ్ల వల్లే ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని చెప్పారు.


Click it and Unblock the Notifications











