అబ్బో..'కాస్కో' చిత్రం కేక పెట్టిస్తోంది
కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్, శ్వేతాబసు కాంబినేషన్ లో వచ్చిన 'కాస్కో' చిత్రం రిజల్ట్ ఏమైందో అందరికీ తెలుసు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ అయిందంటూ హీరో వైభవ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఈ సినిమా ద్వారా నాకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రేక్షకులతోపాటు ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పే నా స్నేహితులు కూడా నన్ను అభినందిస్తున్నారు. అలాగే 'కాస్కో' చిత్రం నన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇది నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్న విషయం అన్నారు.
అలాగే ఈ 'కాస్కో' చిత్రానికి ఎక్కడెక్కడి మాస్ ప్రేక్షకులు క్యూ కట్టేస్తున్నారుట. ఈ విషయాన్నే చెపుతూ 'కాస్తో' అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ మాస్ ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. నాలాంటి కొత్త హీరోకి మాస్ నుంచి ఆశీస్సులు లభించడం ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు. యూత్ ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉండే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. బ్రహ్మానందం గారితో కలసి నా కేరెక్టర్ చేసిన కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు అంటూ రెగ్యులర్ గా సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతూంటే చెప్పే మాటలే చెప్పాడు వైభవ్.


Click it and Unblock the Notifications











